‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా కొన్ని రకాల సమస్యలు వస్తాయని ముఖ్యంగా నెగిటివ్ సమస్యలను ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు. మరి పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Broken Idols

Broken Idols


  • ‎పగిలిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అపశకునమా
    ‎పగిలిన విగ్రహం వల్ల కలిగే నష్టాలు
    ‎పగిలిపోయిన విగ్రహాలు ఇంట్లో నుంచి తొలగించకపోతే

    ‎Broken Idols: మామూలుగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల మన చేతిలోనే వస్తువులు చేజారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి పగిలిన బొమ్మలను, విగ్రహాలను బయటపడడానికి అంతగా ఇష్టపడరు. ఇంకొందరు ఫెవిస్టిక్ వంటివి వేసి వాటిని అతికించి మళ్లీ ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ దేవుడి విగ్రహాలు విరిగిపోతే వాటిని బయటపడవేస్తే ఏదైనా జరుగుతుందేమో అని కొందరు భయపడుతూ ఉంటారు.

    ‎పగిలిపోయిన విగ్రహాన్ని గందరగోళం లేకుండా, జాగ్రత్తగా, సరైన ఉద్దేశంతో నిర్వహించాలట. మీ ఇంట్లో పగిలిపోయిన విగ్రహాలు ఉంటే నిమజ్జనం సాధ్యమైతే, విగ్రహాన్ని శుభ్రం చేసి, పువ్వు లేదా అగరుబత్తి సమర్పించి, ఒక చిన్న ప్రార్థన చేసి క్షణకాలం కృతజ్ఞత చూపితే ఆ తర్వాత నిమర్జనం చేయవచ్చు. నీటిలో నిమజ్జనం సాధ్యం కాకపోయినా లేదా అనుమతి లేకపోయినా, ఆలయాలు మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి. అనేక దేవాలయాలు క్రమం తప్పకుండా పాత లేదా దెబ్బతిన్న ఇత్తడి విగ్రహాలను సేకరిస్తాయి. వీటిని కరిగించి, కొత్త విగ్రహాలు లేదా పూజా సామాగ్రి చేయడానికి తిరిగి ఉపయోగిస్తారు.

    ‎దీనివల్ల లోహం తన పవిత్ర ప్రయాణాన్ని మరొక రూపంలో కొనసాగిస్తుందట. కొందరు మరింత వ్యక్తిగత పద్ధతిని అనుసరిస్తారు. విగ్రహాన్ని శుభ్రమైన కాటన్ వస్త్రంలో చుట్టి రావి చెట్టు కింద ఉంచడం లేదా తోట మూలలో పాతిపెట్టడం వంటివి చేయవచ్చట. పగిలిపోయిన ఇత్తడి విగ్రహాల విషయంలో అలాగే ఇతర విగ్రహాల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న పూజారిని లేదా పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది. విగ్రహాన్ని సాధారణ చెత్త లాగా చూడటం మంచిది కాదట. చుట్టి పడేసినా, చెత్తబుట్టలో వేయడం చాలా మందికి అగౌరవంగా అనిపించి, తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే దెబ్బతిన్నా, దాన్ని స్క్రాప్‌గా అమ్మడం లాంటివి చేస్తుంటారు. అయితే వీటిని మానుకోవాలట. ఒకప్పుడు పూజించిన వస్తువును డబ్బు కోసం మార్చడం సరికాదని చెబుతున్నారు. భయపడి పగిలిన విగ్రహాలను బీరువాల్లో పోగు చేయకూడదని దాని వల్ల అశాంతి పెరుగుతుందని చెబుతున్నారు.
  Last Updated: 17 Dec 2025, 06:10 AM IST