Live 100 Years: నూరేళ్ల ఆయుష్షు కోసం ‘గరుడ పురాణం’ సూత్రాలు

100 సంవత్సరాల ఆయుష్షును అందరూ కోరుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఈ అవకాశం అందరికీ దొరకదు.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 08:28 AM IST

Live 100 Years : 100 సంవత్సరాల ఆయుష్షును అందరూ కోరుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఈ అవకాశం అందరికీ దొరకదు. కొంతమందే నూరేళ్ల జీవితాన్ని పొందుతారు. పూర్వజన్మ కర్మల ఫలితంగా కొంతమంది అకాల మృత్యువువాత పడుతుంటారని పెద్దలు చెబుతారు. మనిషి నూరేళ్ల జీవితం పొందేందుకు ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే వివరాలను గరుడ పురాణం చెప్పింది. ఆ విలువైన అంశాల(Live 100 Years) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

గరుడ పురాణం ప్రకారం.. 

  • ఎక్కువ కాలం బతకాలని ఉంటే వేకువజామునే నిద్రలేవాలి. సూర్యోదయం టైంలో గాలిలో కాలుష్యం ఉండదు. ఆ కాలుష్య రహిత గాలిని పీలిస్తే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.
  • దక్షిణ దిశలో తల పెట్టి నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుంది. అది వీలు కాకుంటే కనీసం పడమర లేదా తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తే మృత్యువు ఒళ్లో నిద్రించినట్టే.
  • రాత్రిపూట పెరుగు కానీ పెరుగుతో చేసిన పదార్థాలు కానీ తినొద్దు. రాత్రిపూట పెరుగు తింటే అనేక వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
  • శ్మశాన వాటిక నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండాలి. శ్మశాన వాటిక నుంచి వచ్చే పొగలో విషపూరిత వైరస్, బ్యాక్టీరియా ఉంటాయని అంటారు. ఆ పొగ పీలిస్తే ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు.
  • మహిళలను, పసిపిల్లలను, వృద్ధులను హింసించరాదు.
  • దైవాన్ని నమ్ముకున్న భక్తులను బాధించరాదు.
  • ఆహారం, నీరు అడిగినవారికి లేదని చెప్పకూడదు.
  • సహాయం చేయగల శక్తి ఉండి కూడా అవసరంలో ఆదుకోకపోవడం పెద్ద నేరం.

Also Read : Rave Party : బెంగళూరు రేవ్‌ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?

గరుడ పురాణం ఎప్పుడు చదువుతారు ?

ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు. ఎందుకంటే దశదిన కర్మ జరిగేలోపు గరుడ పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని, మరుజన్మ ఉండదని నమ్ముతారు. మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మను నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది. అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది.

Also Read : Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..