Chollangi Amavasya : చొల్లంగి అమావాస్య కోటి జన్మల పాప హారిణి.

పుష్య మాసం లోని (Pushya Amavasya) ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు.

Published By: HashtagU Telugu Desk
Varanasi

Varanasi

పుష్య మాసం లోని (Pushya Amavasya) ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ చొల్లంగి అమావాస్య (Chollangi Amavasya) చాలా విశేషమైనది.శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడి గా / వీరరాఘవునిగా ఆవిర్బవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే.అందుకే ఈరోజున మనం ఎంత భక్తి శ్రద్దలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది.ఈ అమావాస్యకి రోగ హరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పియున్నారు. అలానే ఎవరైనా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచం బియ్యం పిండి,పంచదార, (చూర్ణo చేసుకోవాలి )దానికి కొంచం యాలకులు పొడి కలిపి అవునెయ్యి వేసి విష్ణు సహస్ర నామo పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్దాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదం గా తీసుకోవడం చాలా మంచిది. అలానే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసేవిధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశం లో గాని నీటి పాత్రలో గానీ వేయాలి.

 

ఇలా చేయడం ద్వారా ద్రుష్టి దోష ప్రభావం తగ్గుతుంది, అప మృత్యు దోషాలు సైతం తగ్గుతాయి.ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు.లేదా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలానే భగవంతునికి నివేదన చేసిన పాణకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీ పాద తీర్థo గా తలచి అందరూ స్వీకరించాలి.ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీస్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం.పితృ దేవతలకు తర్పణలు పెట్టుకోవడానికి చాలా విశేష మైనది. పితృదేవతలకు ప్రీతిగా అన్నార్తులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించడం చాలా విశేషం ..

భగవద్బంధువులు అందరూ అవకాశం ఉంటే ఈ చొల్లంగి అమావాస్య నాడు విష్ణు సంబందిత ఆలయదర్శనం చేసుకోగలరు.ఆనాడు సకల దేవతా స్వరూపమైన గోమాతకు దానా అందించడం కూడా చాలా మంచిది..!!

  Last Updated: 21 Jan 2023, 02:51 PM IST