Ganesh Idol: ఇంట్లో వినాయక విగ్రహం ఉంటే ఏం జరుగుతుంది.. ఎలాంటి పూజలు చేయాలో తెలుసా?

సాధారణంగా ఇంట్లో అలాగే పూజ గదిలో అనేక రకాల విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో గణేష్

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 06:00 AM IST

సాధారణంగా ఇంట్లో అలాగే పూజ గదిలో అనేక రకాల విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో గణేష్ విగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది. వినాయక విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం శ్రేయస్సు అభివృద్ధి పొందవచ్చు. వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు అన్ని దూరమవుతూ ఉంటాయి. అందుకే చాలామంది వారికి ఇష్టమైన వారికి విగ్నేశ్వరుని విగ్రహాన్ని బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే ఇంట్లో విగ్నేశ్వరుడిని ఎక్కడ పెట్టుకోవాలి అన్నది చాలామందికి తెలియదు. వాస్తు శాస్త్ర ప్రకారంగా వినాయక విగ్రహాన్ని ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం పై ఇంట్లోకి ప్రవేశించే ద్వారం పై కూడా వినాయక విగ్రహం ఉండకూడదు.

మరి ముఖ్యంగా వినాయక విగ్రహాన్ని బాత్రూం గోడ వద్ద అస్సలు ఉంచకూడదు. పడక గదిలో కూడా వినాయక విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఈ విధంగా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురై భార్యాభర్తల మధ్య తరచూ ఆందోళనలు గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే నృత్యం చేస్తున్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం అలాగే బహుమతిగా ఇవ్వడం లాంటివి చేయకూడదు. అలాంటి విగ్రహాన్ని ఇవ్వడం వల్ల కలహాలు సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. అలాగే ఎప్పుడైనా ఇంట్లోకి వినాయక విగ్రహాన్ని విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు కుడి వైపు తొండం ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవడం మంచిది.

ఇలాంటి విగ్రహం తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు తగ్గి ఫలితాలు కనిపిస్తాయి. వినాయకుడికి ఎప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. బెల్లం నైవేద్యంగా పెట్టాలి. దీంతోపాటుగా గరిక, అరటిపండు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ వెలగ కాయ మొదలైన వాటిని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టి పూజించాలి. ప్రతిరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పోషించాలి. మరియు ముఖ్యంగా బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి దానధర్మాలు చేయడం మంచిది. అలాగే ఆరోజు గోమాతకు కూడా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు.