Ganesh Idol: ఇంట్లో విఘ్నేశ్వరుడి విగ్రహం ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా మొదట విగ్నేశ్వరుని పూజించిన తర్వాతనే ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. మొదట విగ్నేశ్వరునిక

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 07:35 PM IST

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా మొదట విగ్నేశ్వరుని పూజించిన తర్వాతనే ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. మొదట విగ్నేశ్వరునికి పూజ చేసి ఎటువంటి ఆటంకాలు ఎదురవకూడదని మొక్కుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా విఘ్నేశ్వరుని విగ్రహం ఉండాల్సిందే. ఇంట్లో విగ్నేశ్వరుడి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం, బహుమతిగా ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టుకోవడం వల్ల జీవితంలో వచ్చే చాలా అడ్డంకులను దూరం చేసుకోవచ్చు.

అయితే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం లేదా బహుమతిగా ఇవ్వడానికి కొన్ని నియమాలు శాస్త్రం ప్రకారం ఈ నియమాలను విస్మరించకూడదు. లేకుంటే అశుభకరంగా ఉంటుంది. కాగా వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుని విగ్రహం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. ఇంటి ప్రదాన గుమ్మంపై ఇంట్లోకి ప్రవేశించే ద్వారం పైన ఉండకూడదు. ముఖ్యంగా వినాయకుని ప్రతిమ లేదా విగ్రహాన్ని బాత్ రూం గోడ వద్ద అస్సలు ఉంచకూడదు. పడకగదిలో కూడా గణేశుని విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆలు, మగల మధ్య అనవసర ఆందోళనలు, ఒత్తిళ్లు ఉంటాయి. నృత్యం చేస్తున్నట్లు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు.

అదేవిధంగా అటువంటి విగ్రహాన్ని కూడా ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. నృత్యం చేస్తున్నట్లున్న వినాయకుని ప్రతిమ ఉండటం వల్ల ఇంట్లో కలహాలు, సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. కూతురు లేదా ఎవరైనా అమ్మాయి వివాహంలో గణపతి విగ్రహాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది అశుభాన్ని సూచిస్తుంది. ఇందుకు కారణం లక్ష్మీ, వినాయకుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. లక్ష్మీతో పాటు వినాయకుడిని కూడా పంపితే ఇంటి నుంచి శ్రేయస్సు, సంతోషం కూడా వారితో పాటు వెళ్తుందని నమ్ముతారు. ఇదే సమయంలో మీరు ఇంట్లో గణేశుని విగ్రహం ఉన్నట్లయితే ఎడమవైపు పూజించాలి. ఎందుకంటే కుడి వైపు పూజించడంలో ప్రత్యేక నియమాలు పాటించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం పిల్లలు కావాలని కోరుకునే వారు, కొత్తగా వివాహం చేసుకున్న జంటలు కుడివైపు తొండం తిరిగి ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలి.

ఇది తల్లిదండ్రులను గౌరవించే బిడ్డకు జన్మనిస్తుందని నమ్ముతారు. మరోవైపు ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి, ఇంట్లో వినాయకుని విగ్రహంతో పాటు ఫొటోను ఏర్పాటు చేయాలి. వినాయకునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి, బెల్లం నైవేద్యం నివేదన చేయాలి. గరిక, అరటిపండు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, వెలగకాయ మొదలగు వాటితో పూజించగలిగితే విశేషమైన శుభ ఫలితాలను గణనాయకుడు ఇస్తాడు, ప్రతిరోజూ నిష్టతో పూజించాలి. బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు, పేదలకు శక్త్యానుసారం దానధర్మాలు విధిగా చేయాలి.