సంపదకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ కటాక్షాలు ఆమె అనుగ్రహం లేకపోతే ఎంతటి కోటీశ్వరులు అయినా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సిందే. ఆమె అనుగ్రహం ఉంటే అన్ని మనతో ఉన్నట్టే అని చెప్పాలి. అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం చాలామంది ఎన్నెన్నో పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటితో పాటుగా పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. సూర్యా స్తమయం తర్వాత చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్లిపోతుందట. మరి సూర్యా సమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
ఉప్పును సూర్యాస్తమయం తర్వాత అసలు కొనుగోలు చేయకూడదట. ఒకవేళ కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అని చెబుతున్నారు. ఉప్పు కొనుగోలు చేయాలని అనుకున్న వారు సూర్యా స్తమయానికి ముందే కొనుగోలు చేయాలట. నువ్వులను కూడా సూర్యాస్తమయం తర్వాత కొనవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం నువ్వులు, నువ్వుల నూనె కొంటే శనిదోషం చుట్టుకుంటుందట. ఈ కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వులు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. అలాగే ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఇనుప వస్తువులను సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట. ముఖ్యంగా కత్తులు, గొడ్డలి, గడ్డపార వంటి ఇనుము వస్తువులు కొనుగోలు చేయకూడదట.
సూర్యాస్తమయం తర్వాత ఆముదం కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. ఆముదపు గింజలు నూనె సూర్యుడు అస్తమించిన తర్వాత కొనుగోలు చేస్తే శని దేవుడు పట్టిపీడిస్తాడట. అలాగే సాయంత్రం సమయంలో పర్సులు, చెప్పులు, బ్యాగ్స్, బెల్టులు తదితర వస్తువులు కొనకూడదని చెబుతున్నారు. అదేవిధంగా దుస్తులు కుట్టడానికి ఉపయోగించే సూదిని కూడా సాయంత్రం పూట కొనుగోలు చేయకూడదట. అలాగే పిన్నీసులు కూడా మహిళలు సూర్యా స్తమయం తర్వాత కొనొద్దని, ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని, లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుందని చెబుతున్నారు.