Site icon HashtagU Telugu

Kashi Yatra : కాశీలో వదిలేయాల్సింది ఏంటో తెలుసా..?

Taking Bath In Ganga Benefits Of Ganga Snan Motivational Story

Taking Bath In Ganga Benefits Of Ganga Snan Motivational Story

కాశీకి వెళ్తే కాయో…పండో వదిలేయాలని పెద్దలు చెబుతుంటారు. అందులో ఉన్నమర్మమేంటో తెలుసా? అసలు శాస్త్రం ఏం చెబుతోంది…కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాలను…కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ణానంతో వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..? కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలో వదలాలి. ఆ విశ్వనాథున్ని దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలని దాని అర్థం.

ఇక ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అంటే ఈ కాయముపై ( అంటే శరీరంపై ఆపేక్షని), ఫలాపేక్షా ( కర్మఫలముపై అపేక్షని) పూర్తిగా వదిలేసి కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. అది కాలక్రమేణా కాయ, పండుగా మారిపోయింది. అంతేకానీ కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేయాలని కాదు. అలా చేస్తే మనకు వచ్చే భక్తి కానీ…పుణ్యం కానీ ఏం ఉండదు. శాస్త్రం నిజంగా ఎలా చెప్పిందో అర్థం చేసుకుని ఈ క్షేత్ర దర్శనము…ఆ సంప్రదాయం పాటిస్తే…నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది.

అంతే తప్పా..మామిడి పండు, వంకాయను గంగలో వదిలేస్తే దాంతో వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అసలు ప్రతి మనిషి తన జీవితంలో బంధాలు, రాగధ్వేషాలు, తోటివారితో వివాదాలు వదిలి పెట్టాలి. కాశీ యాత్ర చేయడం వెనకున్న అసలు విషయం ఇదే. ఆ విశ్వనాథుడిని దర్శించుకుని…అప్పటి నుంచి మ్రుత్యువు దరి చెరే వరకూ మనస్సును ఈ శ్వరుడిపై లగ్నం చేసుకోవాలి. అప్పుడే జీవితమనే పరమపదసోపాన పటంలో ఆత్మ ఈశ్వరుడి పాదాల చెంతకు చేరుతుందని అంతరార్థం.