శనిదేవుడిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తాడని చెబుతూ ఉంటారు. అయితే శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం లభించింది అంటే చాలు ఎంత బీధవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. ఇకపోతే ఆయన అనుగ్రహం కోసం చాలామంది రకరకాల పూజలు పరిష్కారాలు చేస్తూ ఉంటారు. అయితే సనాతన ధర్మం ప్రకారం న్యాయదేవుడైన శని దేవునికి శనివారం రోజు అంకితం చేయబడింది. ఈరోజున స్వామి వారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
శనివారం రోజు శని భగవానుని మనస్పూర్తిగా పూజించి, ఉపవాసం పాటించే భక్తులు ఆయన అనుగ్రహాన్ని పొందుతారని చెబుతున్నారు పండితులు. ఆయన అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు ఉండవట. అలాగే శనిదేవుని చెడు కన్ను పడితే అలాంటి వారి జీవితం కష్టాలతో నిండిపోతుందట. కాబట్టి శనివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, అందుకోసం ఐదు రకాల పనులు చేయాలని చెబుతున్నారు. ఇంతకీ ఏం చేయాలంటే.. శని రక్షా స్తోత్రాన్ని శనివారం పఠించాలి. ఇలా చేయడం వల్ల, సాడే సతి అలాగే శని దోషాల నుండి ఉపశమనం పొందవచ్చట. దీనితో జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయట. కాకి శనీశ్వరుడి వాహనం అన్న విషయం తెలిసిందే.
కాబట్టి శనివారం రోజు కాకులకు ఆహారాన్ని పెట్టడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయట. అలాగే శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిదట. ఇలా చేస్తే శని దేవుడు సంతోషిస్తాడట. అలాగే శనివారం రోజు ఉపవాసం ఉండడంతో పాటు ఆ రోజున మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తప్పకుండా శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుందట. సాయంత్రం వేళ మర్రిచెట్టు కింద నీరు సమర్పించి నువ్వుల దీపం వెలిగించాలని, ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇక శనివారం రోజున నువ్వులు, నల్ల ముద్ద, బెల్లం, నల్ల బట్ట లేదంటే ఇనుము, నూనె లాంటివి ఎవరికి చెప్పకుండా శనివారం రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. అయితే రహస్య దానం మాత్రమే ఫలాన్ని ఇస్తుందని చెబుతున్నారు పండితులు. ఈ విధంగా పైన చెప్పిన పనులు చేయడం వల్ల తప్పకుండా ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందట.