Site icon HashtagU Telugu

Hindu Sastra: ఈ చిన్న పరిహారాలు పాటిస్తే చాలు మీ ఆస్తులు పెరగడం ఖాయం!

Mixcollage 11 Jul 2024 12 52 Pm 5456

Mixcollage 11 Jul 2024 12 52 Pm 5456

తరచుగా కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే చాలు తప్పకుండా ఆస్తులు పెరిగి ధనవంతులు అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు. మరి అందుకోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆస్థులను ఎలాగైనా కొనుక్కోవాలనుకునే వారు గురువారం రోజున 5 రాగి ఆకులను తీసుకోవాలి. వాటిపై గంధంతో బొట్టు లాగా పెట్టాలి. ఎక్కడైతే నీరు పారుతుందో, ఆ పారే నీటిపై ఈ రాగి ఆకులను పెట్టాలి. ఈ విధంగా మూడు గురువారాలు పాటిస్తే ఆస్థులను కొనుక్కునే సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.

ఆస్థులు త్వరగా రావాలి అని అనుకున్న వారు సాయంత్రం సూర్యాస్థమయ సమయంలో 1/2 లీటరు ఆవు పాలను తీసుకోవాలి. ఆ పాలలో 9 తేనె చుక్కలను వేయాలి. ఆ తర్వాత ఇంటి పై భాగానికి వెళ్లి అన్ని దిక్కుల్లో ఈ పాల చుక్కలను చల్లాలి. ఇంట్లో వున్న అన్ని గదుల్లో ఈ పాల చుక్కలను చల్లుతూ వుండాలి. మిగిలిన పాలను ఇంటి ముందు ధారలాగా పొయ్యాలి. గురువారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం సమయంలో వీలయినప్పుడల్లా ఇలా 21 సార్లు చేస్తే ఆస్తులు కొనే యోగం తొందరగా లభిస్తుందని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా ఆదివారం రోజు గోమాతకు బెల్లాన్ని తినిపిస్తూ వుంటే కూడా ఆస్థులు తొందరగా కొనుక్కునే యోగాన్ని కలిగి వుంటారట.

అమావాస్య రోజున ఆకలితోవున్న వారికి భోజనం పెట్టాలి. ఇలా చేసినట్లయితే ఆస్థులు కొనే యోగం తొందరగా వస్తుందట. గురువారం ఏదైనా ఆలయానికి వెళ్లి తులసి మొక్క ఎక్కడవుందో చూడాలి. ఆ మొక్క దగ్గరలో పెరిగిన గడ్డిని కోసి బట్టలో చుట్టి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ మూటకు ధూపాన్ని వేస్తూ వుంటే మీకు ఆస్థులు కొనే యోగం పెరిగిపోతూ వుంటుందట. రంగురంగుల గవ్వలను ఏరి తెచ్చుకోవాలి. వాటిని పొడి చేసుకొని, ఎవరినుంచైతే ఆస్థులు రావాలి అని అనుకుంటున్నారో వారి ఇంటిముందు ఈ గవ్వల పొడిని చల్లాలి. ఇలా ఏడు సార్లు చేస్తే వాళ్లంతట వాళ్లే వచ్చి వాళ్ల ఆస్థులను తిరిగి ఇస్తారట. ప్రతీ ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పకుండా వుండాలి. ఇంటి ఆవరణలో మారేడు మొక్క పెంచుకొని ప్రతీ శుక్రవారం ఆ మొక్క దగ్గర దీపాన్ని పెట్టి పూజచేస్తే లక్ష్మీ దేవీ ఇంట్లోకి వస్తుందట. ప్రతీ ఒక్కరు ఇంట్లో కుండీలో కలబంద మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. కలబంద చెట్టు దగ్గర సాయంత్రం సమయంలో అగరబత్తీలు వెలిగించి, హారతి ఇచ్చినట్లైతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందట. ఇంటి ఆవరణలో ఈ మొక్కలను పెంచుకుంటే ధనపరంగా ఎలాంటి సమస్యలు లేకుండా వుంటాయని పండితులు చెబుతున్నారు.