Sunday: పొరపాటున కూడా ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు?

ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడింది. అలా ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఆ రోజున తెలిసి తెలియక కొన్ని రకాల

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 07:32 PM IST

ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడింది. అలా ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఆ రోజున తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. పొరపాటున అలాంటి తప్పులు చేస్తే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కోక తప్పదు. మరి ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ప్రతి ఆదివారం నాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. అలాగే సూర్యుడికి నీటిని సమర్పిస్తారు.

దీనివల్ల మీ కీర్తి పెరుగుతుందని, అదృష్టం కలుగుతుంది. ఆదివారం నాడు సూర్యభగవానుని పూజిస్తే జీవితంలో అంతా మంచే జరుగుతుంది. కానీ ఆదివారం నాడు కొన్ని పనులను పొరపాటున అస్సలు కూడా చేయకూడదు. లేదంటే సూర్య భగవానుడి అనుగ్రహం పొందలేరు. ముఖ్యంగా మీరు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. సాధారణంగా ఆదివారం సెలవుదినం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ రోజు దాదాపుగా అందరూ ఇండ్లలోనే ఉంటారు. అయితే ఆదివారం నాడు సూర్యాస్తమయానికి ముందు ఉప్పు అస్సలు తినకూడదు. సాధారణంగా ఆదివారం నాడు చాలా మంది చికెన్, మటన్, చేపలను తెచ్చుకుని వండుకుని తింటుంటారు.

చాలా మంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం ఆదివారం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆదివారం నాడు మాసం తినకూడదు. మందు తాగకూడదు. ఆదివారం నాడు చాలా మంది జుట్టును, గోర్లను కట్ చేసుకుంటుంటారు. కానీ ఆదివారం నాడు ఈ పనులు చేయడం నిశిద్ధం. అలాగే ఈ రోజు మీరు రాగి వస్తువులను కొనడం లేదా అమ్మడం మానుకోవాలి. ఆదివారం నాడు మీరు ఈ పనులకు దూరంగా ఉంటే సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే చెడు దృష్టికి దూరంగా ఉంటారు. అలాగే మీ జీవితం ఆనందంగా సాగుతుంది.