పూర్వం మన పెద్దల కాలం నుంచే కొన్ని విషయాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది వాటిని మూఢనమ్మకాలు చాలాసార్లు అని కొట్టి బాధిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాటి వెనకాల ఆధ్యాత్మికతతో పాటుగా సైన్స్ కూడా దాగి ఉంది. కానీ చాలామంది ఈ విషయాలను అసలు నమ్మరు. అయితే మామూలుగా సూర్యోస్తమయం సమయంలో అలాగే సూర్యోదయం సమయంలో కొన్ని కొన్ని పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు.
వాటి వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అని కూడా చెబుతూ ఉంటారు. అయితే సూర్యాస్తమయం అనగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొన్ని రకాల వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదట. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కోడిగుడ్లు ఆవాలు నువ్వులను కొనుగోలు చేయకూడదట. ఈ వస్తువులను పక్కింటి నుంచి కూడా అప్పుగా తీసుకోకూడదట. అలాగే అప్పుగా కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ఆముదం, ఆముదం గింజలు,సూదులు సేఫ్టీ పిన్స్ వంటివి కొనుగోలు చేయకూడదట.
కేవలం ఇవి మాత్రమే కాకుండా కత్తెర, కత్తిపీట, కత్తులు, ఇనుము, సుత్తి, గడ్డ పార, గునపం, లెదర్ తో తయారు చేసిన వస్తువులు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పు బియ్యం వంటివి కూడా ఇతరులకు ఇవ్వకూడదట. అలాగే పప్పు కూడా ఇతరులకు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకూడదట. పైన చెప్పిన విషయాలు పాటించకపోతే అరిష్టం చుట్టుకుంటుందని, కష్టాల పాలవ్వడం కాయం అని తెలుస్తోంది. అలాగే లేనిపోని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట.