Vastu Tips : ఈ దీపావళికి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే..ఈ వస్తువులను పూజా గదిలో ఉంచండి..!!

హిందూవులు పవిత్రంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో దీపావళి ఒకటి. ఈ పండగ వచ్చేనెల అక్టోబర్ లో వస్తుంది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 09:00 AM IST

హిందూవులు పవిత్రంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో దీపావళి ఒకటి. ఈ పండగ వచ్చేనెల అక్టోబర్ లో వస్తుంది. దీపావళికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సారి లక్ష్మీపూజలో ఈ వస్తువులను ఉంచడం అస్సలు మర్చిపోకండి. ఈ వస్తువులను లక్ష్మీపూజలో పెట్టి పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.

1. పూజాగదిలో శంఖాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శంఖం సంపద, శ్రేయస్సుకు చిహ్నం. అలాగే లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఇంటి నుంచి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది . మీ పూజాగదిలో తప్పనిసరిగా శంఖం ఉంచాలి. ఇంట్లో శంఖం ఉంచడం అంటే ఇంట్లో విష్ణువు నివాసం ఉంటున్నాడని అర్థం. విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. సంపద శ్రేయస్సును ఆకర్షించడం ద్వారా, తల్లి లక్ష్మీ ఆశీస్సులు మీపై ఉంటాయి.

2. పూజగదిలో గోవుల చిత్ర పటం :
ఆవులు కూడా డబ్బును ఆకర్షిస్తాయి. వాటి చిత్ర పటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. మా లక్ష్మి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీపావళి, దంతేరస్ సమయంలో పూజించిన తర్వాత గోవు చిత్రాన్ని ఒక ఖజానాలో లేదా పర్సులో ఉంచినట్లయితే, అది శుభప్రదమని లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై శాశ్వతంగా ఉంటుంది. మీ పర్సు లో ఎల్లప్పుడు 1 పైసా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.

3. పూజగదిలో తామరపువ్వు:
లక్ష్మీ దేవి ఆరాధనలో తామర పువ్వును సమర్పించడం చాలా ముఖ్యం . లక్ష్మీదేవి పేరు కూడా కమలాసన అని, అంటే కమలంపై కూర్చోవడం అని అర్థం. అందుకే ఈ పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అంతే కాదు తామర పువ్వు శాంతికి చిహ్నం. పూజగదిలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దీనితో లక్ష్మీదేవి ఎప్పుడూ సంతోషిస్తుంది. సంపద మాయతో ముడిపడి ఉన్నందున, తామర పువ్వు ఒక వ్యక్తిని ఎప్పటికీ సుఖంగా ఉండేలా ప్రేరేపిస్తుందని కూడా నమ్ముతారు.