మామూలుగా బల్లి ఉందని ఇండ్లు అంటే బహుశా ఉండదేమో అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు తప్పనిసరిగా ఉంటాయి. అయితే స్త్రీ పురుషులు చాలామంది ఈ బల్లిని చూస్తే తెగ భయపడి పోతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది ఇంట్లో బల్లిని చూస్తే శకునంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇంట్లో మనకు మామూలుగా బల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ తోక లేని తల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో బల్లి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట. జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందనేందుకు సంకేతమట. అదృష్టం, సంపద మీ దరిచేరకుండా గుర్తుగా ఇంట్లో బల్లి కనిపిస్తుందట.
కలలు భవిష్యత్తును తెలియజేసే సాధనాలు. ఇవి ఒక్కోసారి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కొంత మందికి బల్లి కలలో కనిపిస్తుంది. కొంత మందికి ఎక్కడికి వెళ్తే అక్కడ బల్లులు లేదా బల్లుల బొమ్మలు లేదా ఏదో ఒక బల్లికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి యాదృశ్చికం కూడా కావచ్చు. ఆహారం, నీళ్లు, నీడ కోసం వెతుకుతూ ఇంట్లో చేరుతాయి. వాటి ద్వారా మీకు అందాల్సిన సందేశం అందే వరకు బల్లులు మీకు కనిపిస్తునే ఉంటాయి. ఇంట్లో బల్లులు కనిపించాయంటే రకరకాల అర్థాలు ఉన్నప్పటికీ కొన్ని సాధారణ అర్థాల గురించి చెప్పుకుందాం. ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైందని అర్థం.
వ్యక్తిగా మీరు అన్ని రకాలుగా అంగీకారయోగ్యమైన వారని అర్థం. సాధారణంగా బల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి. అయినా మీకు కనిపించింది అంటే కచ్చితంగా ప్రత్యేక కారణం లేకుండా ఉండదు. కొత్త విషయాలేవో మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం. కొత్త వ్యక్తుల రాకతో మీ జీవితం మరింత మెరుగవుతుందని అర్థం. అది మీకు పునర్జన్మ వంటిది కావచ్చు. ఇంట్లో బల్లి కనిపించడం రాబోయే అదృష్టానికి, సంపదకు సంకేతంగా చాలా సంస్కృతుల్లో నమ్ముతారు. చైనీయులు బల్లిని బేబీ డ్రాగన్ గా భావిస్తారు. ఇది సంపద, కీర్తి, ప్రతిష్టలకు సంకేతంగా భావిస్తారు. పాత మిత్రులు లేదా ఆత్మీయుల వ్యక్తుల గుర్తుగా కూడా బల్లి కనిపించవచ్చు.
కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభశకునంగా భావిస్తారు. కష్టంలో ఉన్నపుడు బల్లి కనిపిస్తే మీరు మీ కష్టాన్ని విజయవంతంగా గట్టెక్కుతారని అర్థం. బల్లి తన మనుగడ కోసం జరిగే పోరాటంలో అవసరమైతే తోక వదులుకుంటుంది. ఇది జీవితం త్యాగాన్ని ఆశిస్తుందని చెప్పటానికి సంకేతం.
ఇంట్లో బల్లి కనిపిస్తే ఒక్కోసారి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కూడా కావచ్చు. మీరు తోక తెగిపోయిన బల్లిని మీ ఇంట్లో గమనిస్తే అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారనేందుకు ప్రతీక. మీ చుట్టు నమ్మక ద్రోహులు చేరారని కూడా మీరు తెలుసుకోవాలని కూడా అర్థం. కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వారు మీకు చెడు చేసే వారా మంచి చేసే వారా అనేది బల్లి సంకేతంలో కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.