మామూలుగా మనం ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవడం అన్నది సహజం. అసలు తీర్థం అంటే ఏమిటి? తీర్థాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి? ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. మరి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా బాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు ఉంటాయి. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి.
ఇంట్లో లేదా దేవాలయాల్లో ఎక్కడ మనం తీర్థాన్ని పుచ్చుకున్నా కూడా మూడుసార్లు తీసుకోవాలి. అందులో మొదటగా తీసుకునే తీర్థము ధర్మసాధన కోసం, రెండవ సారి స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, ఇక చివరగా మూడవ సారి తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. ఇలా తీర్థాన్ని మూడు సార్లు తీసుకోవడం ఇంకా ఉన్న అంతర్యం ప్రయోజనం ఇవే. ధర్మ సాధన కోసం ద్వితీయ ధర్మ సాధనం అని తీర్థాన్ని ఆస్వాదించాలి. అంటే ధర్మాన్ని సాధించుటలో ప్రవృత్తిని ఈ తీర్థం కలుగజేస్తుందని భావం. చివరకు అందరికీ కావలసింది మోక్షము. ఇది నిత్యమైనది. శాశ్వతమైంది. పునరావృత్తి లేనిది.
చాలామంది అలవాటులో పొరపాటుగా తీర్థం తీసుకున్న వెంటనే ఆ చేతిని తల పైకి అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం అసలు మంచిది కాదు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని శుభ్రం చేసుకోవడం లేదంటే ఆ తీర్థాన్ని మన కడుపు లేదా ఉదయానికి రాసుకోవడం మంచిది. కాబట్టి తెలిసి తెలియక కూడా ఇలా తీర్థం విషయంలో పొరపాట్లను చేయకూడదు.