Tulasi Pooja: ఈ శ్లోకం జపిస్తూ తులసికి పూజ చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయి..!!

హిందూశాస్త్రాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తాం. పురాణాల్లోనూ తులసిమొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 07:15 AM IST

హిందూశాస్త్రాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తాం. పురాణాల్లోనూ తులసిమొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి మహిళలు తలస్నానమాచారించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలంటూ తులసి మనసారా పూజిస్తుంటారు. విష్ణువును ఆరాధించిన తులసి…ఆయన పలు అవతాలరకు సంబంధించిన పండగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది. కొందమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తుంటారు. తులసి తీర్థం అనేమాట తరచుగా వింటుంటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సంప్రదాయంల ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారిణిగా కూడా భావిస్తుంటారు.

తులసిని పూజించడంలో ఆంతర్యం ఏంటి..?
ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారథిగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. భక్తులు తమ అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది. పుట్టుక, మరణించుట, పునర్మజన్మ అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే మోక్షం. దీనికి కోసమే స్రుస్టిలోని ప్రతిజీవి ఆశపడుతుంటారు.

తులసిని పూజిస్తే…వాస్తు దోషాలుంటే తొలగుతాయి..
తులసిని సనాతన ధర్మంలోని పలు రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవికి భౌతికరూపమని అందుకే తులసి మొక్కను ప్రతిరోజూ ఎంతో భక్తితో కొలుస్తుంటారు. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. తులసి కోట ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. చాలామంది ఇళ్లలో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తారు. సాధారణ దగ్గు, ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు తులసి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు తలుసి మొక్క ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఎలా పూజించాలి…
తులసి చెట్టు చుట్టు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. నూనెతో దీపం వెలిగించాలి. కలశంలో నీరు తీసుకుని రెండు చేతులతో పట్టుకుని నీరు పోయాలి. పసుపు, కుంకుమ, పూలు, ధూపాన్ని తులసికి సమర్పించాలి.
ఈ క్రింద చెప్పిన శ్లోకాన్ని జపిస్తూ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి.

తులసి కననం యాత్ర యాత్ర పద్మవాణి చ

వాసంతి వైష్ణవ యాత్ర తత్ర శాంతిహితో హరి

పుష్కరధ్యాని తీర్థాని గగాధ్యాయ సరితాస్ తథా

వాసుదేవ దయో దేవా వాసంతి తులసివనే

ప్రసీత తులసి దేవ ప్రసీత హరి వల్లభే

క్షీరోత మథనోత్ బూతే తులసిత్వం నమయహం

ఈ కింద చెప్పిన పద్యంతో తులసి వందనాన్ని ముగించాలి..

తులసి సఅరీ సుఖే శుభే పాప హరిణి పుణ్యతే

నమస్తే నారథ నూతే నమో నారాయణ ప్రియే

తులసికి ప్రత్యేక పూజ..
ప్రతిఏడాది కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసికి చెరుకు గడలతో పందిరి వేసి…మామిడి తోరణాలు కట్టి…పూలతో అందంగా అలంకరిస్తారు. తర్వాత పూజ చేసి భక్తిశ్రద్ధలతో తులసిని సేవిస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా భారతదేశంలో ఉంది. దీపావళి ఉత్సవాల్లోనూ తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలతోదీపాలు పెట్టి అలంకరిస్తారు.