Ganesh Chaturthi: వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. భారీ

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 08:40 PM IST

త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి డీజే లు డప్పులతో పండుగ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వినాయక విగ్రహాల కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు.. కొన్ని ప్రదేశాలలో వినాయక విగ్రహానికి మూడు రోజులు పూజిస్తే మరికొన్ని ప్రదేశాలలో ఐదు రోజులు చివరిగా 11 రోజులు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా ఎన్ని రోజులు పూజ చేసినా కూడా చివరికి విగ్నేశ్వరుని నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. నిమజ్జనం చేసేటప్పుడు లో లోపల బాధ ఉన్నప్పటికీ 11 రోజుల తర్వాత అయినా గణపయ్య గంగమ్మ గుడికి చేరక తప్పదు.

అయితే వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షాకాలంలో.. ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు. అలా మట్టి తీస్తే చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలు ఉన్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటంది. అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి.

అలాంటి నీటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చాలా మంది నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీని వల్ల నీరు శుద్ధి అవుతుంది. అలాగే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. భూలోకానికి వచ్చిన వినాయకుడు పది రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని పదిరోజుల పాటు నిత్యం పూజలు అందుకుని ఆ తరువాత మళ్ళీ తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. కేవలం వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా దసరా నవరాత్రుల్లో ఏర్పాటు చేసే దుర్గమ్మ విగ్రహాలు కూడా నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు.