మామూలుగా మనం పూజ చేసిన తర్వాత సామ్రాన్ని ధూపం వేయడం అన్నది కామన్. ధూపం వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయట. ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, సువాసన భరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది. అలాగే పూజగ దిలో సాంబ్రాణిని వెలిగించడం వల్ల ఇళ్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే వారంలో ఒక్కోరోజు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి ఏఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆదివారం.. రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయడం వల్ల ఆత్మబలం పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయట. ఈశ్వర అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతున్నారు.
సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట. అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందట.
మంగళవారం రోజున ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల శత్రుభయం, ఈర్ష్య, అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు పండితులు. అలాగే అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరతాయట. అలాగే కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చట.
బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మక ద్రోహం, అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. బుధవారం రోజున సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
గురువారం రోజు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే గురువారం రోజున పూజ గదిలో సాంబ్రాణి పొగ వేయాలని చెబుతున్నారు. గురు అనుగ్రహం లభిస్తుందట.
శుక్రవారం రోజున సాంబ్రాణి ధూపం వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందవచ్చట. ఈ రోజున సాంబ్రాణి ధూపం వేయాలని శుక్రవారం రోజున ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చని చెబుతున్నారు.
శనివారం రోజున సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కుటుంబంలో ఎవరికైనా బద్దకంగా ఉంటే బద్ధకం తగ్గి యాక్టీవ్ అవుతారట. ఇలా ఒక్కోరోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఫలితాలను పొందవచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు.