Site icon HashtagU Telugu

Pumpkin: ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారో మీకు తెలుసా?

Mixcollage 07 Jul 2024 02 59 Pm 9750

Mixcollage 07 Jul 2024 02 59 Pm 9750

మామూలుగా మనం ఇంట్లో ఆఫీసులు, వ్యాపార స్థలాలలో దిష్టి తగలకుండా ఉండడం కోసం గుమ్మడికాయను ఎక్కువగా కడుతూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కువగా బూడిద గుమ్మడికాయను దృష్టి నివారణ కోసం గుమ్మం పై కడుతుంటారు. అయితే ఇలా కట్టిన గుమ్మడికాయ కొన్ని సార్లు కొద్ది రోజులకే కుళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇలా వేంటనే కుళ్ళిపోతే నరదృష్టి ఎక్కువగా ఉందని, ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉందని నమ్ముతుంటారు. అందుకే మన పెద్దలు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని చెబుతుంటారు. అందుకే మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టమని చెబుతుంటారు నిపుణులు.

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ, నరదృష్టి నివారణకు గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోవాలి. అయితే గుమ్మడి కాయను ఎలా పడితే అలా కాకుండా శాస్త్రోక్తంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులచే పూజ చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయాలి. కానీ చాలా మంది ఇవేమి చేయకుండా ఇంట్లో దేవుడి గదిలో పెట్టి గుమ్మడి కాయను కడుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు.
అదేవిధంగా ప్రతీ రోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడి కాయకు, ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రానికి ధూపం చూపించాలి. ప్రతీ రోజు ఇంట్లో పూజ చేసుకున్నపుడు రెండు అగరబత్తిలను వెలిగించి గుమ్మడి కాయదగ్గర పెట్టాలి.

అలాగే మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రం ఉండటం వలన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఇంటిని కాపాడుతుందట. నరదృష్టి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుందట. మీరు ఎక్కువగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళి పోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని అర్థం చేసుకోవాలి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని మీరు గమనించాలి. అయితే అలా పాడైపోయిన ఆ గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని పూజ చేయించుకుని కొత్తగా మల్లి కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అర్థం. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు. గుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆశక్తి మరింత రెట్టింపు అయి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది.