Ash Pumpkin: బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?

మన వంటింట్లో దొరికే కూరగాయలలో ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండే కూరగాయ గుమ్మడికాయ అని

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 06:30 AM IST

మన వంటింట్లో దొరికే కూరగాయలలో ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండే కూరగాయ గుమ్మడికాయ అని చెప్పవచ్చు. ఈ గుమ్మడికాయలో రెండు రకాల గుమ్మడికాయలు ఉంటాయి ఒకటి మామూలు గుమ్మడి కాయ రెండవది బూడిద గుమ్మడికాయ. అయితే మామూలు గుమ్మడికాయతో పోల్చుకుంటే బూడిద గుమ్మడికాయ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయను ద్రుష్టి నివారణ కోసం ఇంటి గుమ్మం పై కడితే కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటుంది. అయితే అలా కొద్ది రోజులకి బూడిద గుమ్మడికాయ పాడవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అలా తొందరగా బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే ఇంటి నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. మన పెద్దలు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని చెబుతుంటారు. అందుకే ఈ బూడిద గుమ్మడికాయను వ్యాపార స్థలాలలో ఇంటిదగ్గర, నివారణ కోసం కడుతూ ఉంటారు.

అయితే నరదిష్టి నివారణ కోసం ఇంటి దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోవాలి. ఇలా చేసిన తర్వాత ప్రతిరోజు రెండు అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు అలాగే ఆ ఫోటోకి ధూపం చూపించాలి. అదేవిధంగా ఇంట్లో పూజ చేసినప్పుడు వారింటి అగరబత్తీలను వెలిగించి గుమ్మడికాయకు దగ్గరగా పెట్టాలి. ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ ఐశ్వర్య కాలి ఫోటో యంత్రము ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అవి కాపాడతాయి. అయితే ఎప్పుడైనా మీరు బూడిద గుమ్మడికాయ కట్టిన కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయి అంటె దాని అర్థం మీ ఇంటి పై ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని అర్థం. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అలా పాడైపోయిన గుమ్మడికాయను పారేసి మరొక గుమ్మడికాయ పూజ చేసి మళ్లీ కట్టాలి. అలాగే అద్దె ఇంట్లో నివసిస్తున్న వారైనప్పటికీ ఇంటి ద్వారా ముందు గుమ్మడికాయను కట్టుకోవడం మంచిది. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అని అర్థం. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది. గుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది. అయితే వ్యాపారకదేశంలో కానీ ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ సంవత్సరమైనా అలాగే ఉంటే సంవత్సరం తర్వాత దానిని తీసివేసి దాని ప్రదేశంలో మరొక కొత్త గుమ్మడికాయను కట్టాలి. ఇంట్లో ఎవరైనా చనిపోయిన, అమ్మాయిలు పుష్పావతి అయిన ఎటువంటి అషడ్డాలు జరిగిన ఆ పూజ చేసిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది. అప్పుడు ఆ గుమ్మడి కాయను తీసివేసి మరొక గుమ్మడికాయను కట్టుకోవాలి. అయితే చాలామంది వారే స్వయంగా పూజ చేసి కుంకుమ పసుపు బొట్టు పెట్టి వాటిని కడుతూ ఉంటారు. అలా కాకుండా విధివిధానంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించి శుభముహూర్తంలో వాటిని కట్టాలి.