Shani Dev: శనిదేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది.. దేనికి సంకేతం?

సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మంచి కలలు వస్తే మరి కొన్నిసార్లు భయంకరమైనవి,పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. భయంకరమైనవి, పీడకలలు వచ్చినప్పుడు చాలామంది అలానే జరుగుతుందేమో

Published By: HashtagU Telugu Desk
Shani Dev

Shani Dev

సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మంచి కలలు వస్తే మరి కొన్నిసార్లు భయంకరమైనవి,పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. భయంకరమైనవి, పీడకలలు వచ్చినప్పుడు చాలామంది అలానే జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. పదేపదే ఆ కలలో వచ్చిన విషయాల గురించి తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మనకు వచ్చే ప్రతి ఒక్క కలకు ప్రత్యేక అర్థం ఉంటుంది అంటున్నారు నిపుణులు మన ఆలోచనలు మన నిర్ణయాలను బట్టి అటువంటి కలలు వస్తూ ఉంటాయట. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు కలలో దేవుడు కూడా కనిపిస్తూ ఉంటారు.

ఒకవేళ మనకు కలలో శని దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది? శని దేవుడు కలలో కనిపించడం వరమా? శాపమా? అసలు దేనికి సంకేతం? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. మనకు వచ్చే కొన్ని రకాల కలలు మన ఇద్దరిని చెడగొట్టడంతో పాటు మనల్ని మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ కలలో మనల్ని ఆలోచనలో పడే విధంగా చేస్తాయి. అయితే కలలు కూడా రెండు రకాలు కలలు వస్తూ ఉంటాయి. అందులో మొదటిది గతంలో జరిగిన సంఘటన ఆధారంగా వచ్చి కల అయితే, రెండవది భవిష్యత్తులో జరగబోయే అంశాల ఆధారంగా వచ్చే కలలు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మనం చూసే కొన్ని విషయాలు జీవితంలో నిజం అవుతాయి.

ఇక, కొన్ని కలలకు అలాగే శని దేవుడికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుందట. మీకు కలలో శని దేవుడికి సంబంధించిన కలలు వస్తున్నాయంటే.. మీ జీవితంలో ఏవో మార్పులు జరగబోతున్నాయని అర్థం. అలాగే శని దేవుడు మీ పట్ల దయ చూపడం లేదా మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ కలలు సంకేతంగా చెప్పవచ్చు. అలాగే కలలో శని దేవుడి విగ్రహం లేదా చిత్రం కనిపిస్తే రాబోయే కాలం మీకు సుఖ సంతోషాలను వస్తాయి. అదే సమయంలో మీ జాతకంలో శని స్థానాన్ని బట్టి దాని ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి శని దేవుడి విగ్రహం కలలోకి వస్తే లేని ఇబ్బందులు ఎదురవొచ్చు. మీ కలలో శని దేవుడే నేరుగా వచ్చి అనుగ్రహించినట్లయితే ఆ కల చాలా శుభప్రదం. శని దేవుడు మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తాడని అర్థం. ఇక అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇతరత్రా సమస్యలతో బాధపడేవారికి శని దేవుడు కలలో కనిపిస్తే వారి సమస్యలన్నీ తొలగిపోతాయి అని అర్థం. కలలో శని మాత్రమే కాకుండా శని దేవుని దేవాలయం కనిపిస్తే శుభప్రదమని చెబుతారు. ఆ వ్యక్తులు శనిదేవుని అనుగ్రహాన్ని పొందబోతున్నారని అర్థం. శని దేవాలయం కలలో కనిపించడం ధన లాభానికి సంకేతం. అలాగే కొన్ని కీలక పనుల్లో విజయం సాధిస్తారని సంకేతం అని చెప్పవచ్చు.

  Last Updated: 07 Sep 2022, 11:11 PM IST