Site icon HashtagU Telugu

Rainbow In Dream: కలలో రెయిన్ బో కనిపిస్తే దేనికి సంకేతం? లాభమా నష్టమా?

Rainbow

Rainbow

సాధారణంగా పడుకున్నప్పుడు నిద్రలో కలలు రావడం అనేది సహజం. అయితే కలలో కూడా రెండు రకాలు వస్తాయి. అవి ఒకటి భవిష్యత్తులో జరిగేవి. ఇక రెండవది గతంలో జరిగిన విషయాలు. అయితే కలలో చాలామంది పీడ కలలు వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. అటువంటివి జరుగుతాయి ఏమో అని భయపడుతూ ఉంటారు. అయితే కలలో మనకు ఇంద్రధనస్సు కనిపిస్తే దేనికి సంకేతం.

ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే లాభమా? లేక నష్టమా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలల శాస్త్రం ప్రకారం ఎవరికి అయినా కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే అది మంచికి సంకేతంగా భావించవచ్చు. కలలోకి ఇంద్రధనస్సు కనిపిస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఎదురుచూస్తున్నాయని పెద్దలు విశ్వసిస్తు ఉంటారు. కాబట్టి కలలో ఇంద్రధనస్సు కనిపించినప్పుడు ఎటువంటి భయాలు భయాందోళనలు అక్కర్లేదు. కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే జీవితంలో కీర్తి, పరువు మరియు ప్రతిష్ట పెరుగుదలను అది సూచిస్తుంది.

అలాగే కలలో ఇంద్రధనస్సు రావడం అంటే ఉద్యోగులు పనిలో విజయాన్ని అందుకుంటారని నమ్మకం. ఇక వ్యాపారులకు అయితే పెట్టుబడులకు తగిన లాభాలను ఆర్జిస్తారని నమ్మకం. అదేవిధంగా వివాహితుడు అయిన పురుషులకు కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే, వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అవివాహితులకు అంతా సాధారణంగా ఉండనుంది.