Site icon HashtagU Telugu

Naga Panchami: నాగ పంచమిరోజు పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందా?

Nag Panchami

Nag Panchami

భారతదేశంలో హిందువులు ప్రతి ఏడాది శ్రావణమాసంలో నాగుల చవితిని జరుపుకోవడం అన్నది తరతరాలుగా వస్తున్న ఆచారం. అంతే కాకుండా భారతీయులు జరుపుకునే పండుగలను ఇది కూడా ఒకటి. అయితే కొందరు నాగుల చవితి సందర్భంగా పుట్టకు పాలు పోస్తే మరి కొందరు నాగుల కట్టకు పాలు పోయడం, పాలాభిషేకం చేస్తూ ఉంటారు. కొందరి మొదటి వారం రెండవ వారం మూడవ వారం పాలు పోస్తూ ఉంటారు. నాగుల చవితి తర్వాత వినాయక చవితి రావడంతో చాలామంది వినాయక చవితి పండుగ రోజు కూడా పుట్టకు పాలు పోస్తూ ఉంటారు.

నాగుల చవితి, లేదా నాగ పంచమి రోజున పుట్టకు పాలు పోయడంతో పాటు నాగదేవతకు ఇష్టమైన తెల్ల చలివిడి, నల్ల చలివిడి, కోడిగుడ్డు పాలు నైవేద్యంగా పెట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే కోరిన కోరికల నెరవేర్చమని వేడుకుంటూ ఉంటారు. నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగులచవితి మాదిరిగానే నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. ప్రజలు ఈ పూజ చేయడం వెనుక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నాగ పంచమిన నాగదేవతకు పూజ చేయడం వల్ల కుటుంబాన్ని దుష్టశక్తుల నుండి రక్షిస్తుందని విశ్వాసం ఉంది.

రాహు, కేతు దుష్ప్రభావాలు తగ్గడానికి నాగర పంచమి చేస్తారు. శివుడు గుహ చుట్టూ పాములు ఉన్నప్పుడు, విష్ణువు పాముపై నిద్రిస్తాడు. శ్రీ కృష్ణుడు ఉన్నప్పుడు, పాము పిల్లవాడిని వదిలి, వర్షం నుండి బిడ్డను కాపాడుతుంది. నాగదేవత ఆశీర్వాదం మనపై ఉండాలనే నమ్మకంతో ప్రజలు నాగ పంచమిని చేయడానికి ఇష్టపడుతారు, తద్వారా జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. నాగ పంచమి రోజున పుట్టినరోజు పాలు పోయడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండవని నమ్ముతుంటారు. అలాగే పుట్టక పాలు పోసిన తర్వాత అక్కడ ఉన్న కొంచెం పుట్టమన్ను తీసుకుని స్త్రీలు ఉదరానికి రాసుకోవడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండవట.

Exit mobile version