Site icon HashtagU Telugu

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!

What Is The Result Of Any Verse In Vishnu Sahasranamam

What Is The Result Of Any Verse In Vishnu Sahasranamam

మాఘ మాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనామ (Vishnu Sahasranamam) పారాయణ, జపం, ఉపవాసం విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక  ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు. గంగాదేవి – శంతన మహా రాజుకి జన్మించిన ఎనిమిదో సంతానం బీష్ముడు.

కురుక్షేత్ర యుద్ధం అనంతరం అంశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే విష్ణు సహస్రనామాలు (Vishnu Sahasranamam). అందులో ఒక్కో శ్లోకం ఒక్కో ఫలితాన్నిస్తుంది. ఏ శ్లోకాలు చదివితే ఎలాంటి ఫలం దక్కుతుందంటే..

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్||

విద్యాభివృద్ధికి : 14వ శ్లోకం

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

ఉదర రోగ నివృత్తికి:- 16వ శ్లోకం

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

సంతోషంగా ఉండేందుకు:- 18వ శ్లోకం

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

మేధాసంపత్తికి:- 19వ శ్లోకం

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

కంటి చూపునకు:- 24వ శ్లోకం

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

కోరికలు నెరవేరాలంటే:- 27వ శ్లోకం

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

వివాహ ప్రాప్తికి:- 32వ శ్లోకం

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

అభివృద్ధికి:- 42వ శ్లోకం

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

మరణ భయం తొలగిపోయేందుకు:- 44వ శ్లోకం

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

కుటుంబ ధనాభివ్రుద్ధికి:- 46వ శ్లోకం

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం!!

ప్రయాణం చేసేముందు

వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||

నిత్యం ఈ ఒక్క శ్లోకం చదువుకున్నా సహస్రనామాలు చదివిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు 

ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||

అనేక పవిత్ర ధర్మములు విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:

భీష్ముడి జ్ఞానబోధ తర్వాత ధర్మరాజు ఆరు ప్రశ్నలు అడిగాడు..

  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే – లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ – జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ – ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభం కలుగుతుంది?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ – ఏ దేవుని అర్చించుట వలన  మంచి జరుగుతుంది?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః – సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనాల నుంచి ముక్తి లభిస్తుంది?

ఈ ఆరు ప్రశ్నలకు భీష్ముడు చెప్పిన ఏకైన సమధానం విష్ణు సహస్రనామ పఠనం. 

Also Read:  Foreign Trip Tips : మీరు మొదటిసారి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా?