Shani Dev: శని గ్రహాన్ని శనీశ్వరుడని ఎందుకంటారో తెలుసా.. నమ్మలేని నిజాలు?

సాధారణంగా నవగ్రహాలు అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు,బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు. శని గ్రహాన్ని

  • Written By:
  • Publish Date - November 6, 2022 / 06:30 AM IST

సాధారణంగా నవగ్రహాలు అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు,బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు. శని గ్రహాన్ని శనీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు అని చాలామందికి అనుమానం వచ్చి ఉంటుంది. చాలామంది పిలిచినప్పుడు కూడా శనీశ్వరుడు అని అంటే శని పక్కన ఈశ్వరుడు అనే శబ్దాన్ని కూడా పలుకుతూ ఉంటారు. అయితే అలా ఎందుకు పలుకుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనీశ్వరుడుని,శనేశ్చరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

శని చరుడు..దీని అర్థం నెమ్మదిగా చలించేవాడు అని అర్థం. మిగిలిన గ్రహాలు అన్నీ కూడా వేగంగా కదులుతూ ఉండగా శనీశ్వర గ్రహం మాత్రమే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటూ నెమ్మదిగా కదులుతూ ఉంటాడు. ఈశ్వర శబ్దం ఎక్కడ అయితే వినిపిస్తుందో అక్కడ బోలాతత్వం అనేది ఉంటుంది. ఎప్పుడైనా శివ శంకరా పరమేశ్వర కాపాడ వయ్యా అని పిలిస్తే చాలు ఆ పరమేశ్వరుడు తనని పూజించే భక్తుల కోసం కాపాడడానికి వస్తాడు. అయితే మంచివారా చెడ్డవారా ఎవరా అన్నది ఆ ఈశ్వరుడు చూడకుండా తనని పిలిచిన వారికి సహాయం చేయడానికి ఆదుకోవడానికి వెళ్తాడు.

అలాగే ఆ పరమశివుడిని గొప్పగా పొగిడితే చాలు ఆ పరమశివుడు బోలాశంకరుడిగా మీకు గొప్ప వరాలు ఇచ్చేస్తాడు.ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.