Site icon HashtagU Telugu

Kalasha: కలశ పూజ ప్రాముఖ్యత ఏమిటి.. పూజలో మామిడి ఆకులు కొబ్బరికాయ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

Kalasha

Kalasha

చాలా వరకు హిందువులు చేసే పూజలలో కలశ స్థాపించడం అన్నది మనం చూసే ఉంటాం. చాలా రకాల పూజలలో కలశ పూజ చేస్తూ ఉంటారు. కలశాన్ని రాగి, స్టీలు,ఇత్తడి,వెండి, లేదా బంగారం వంటి లోహాలతో చేసిన వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కుండ పవిత్ర జలంతో పాటు చిటికెడు పసుపు, లేదా పసుపు కొమ్ము, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ, రాగి నాణెం, దర్భ గడ్డి వంటి ఇతర పవిత్రమైన పదార్థాలతో నింపబడి ఉంటుందట. కలశంపై మామిడి ఆకులను ఉంచుతారు. ఈ ఆకులపై ఒక కొబ్బరి కాయను కూడా పెడతారు. అలాగే కొబ్బరికాయ పైన ఒక కొత్త త్రిభుజాకార వస్త్రాన్ని కూడా ఉంచుతారు. కలశంలోని నీరు ఒక ప్రత్యేక మంత్రాన్ని జపించడం ద్వారా శక్తిని పొందుతుంది.

ఇది విశ్వ శక్తిని ప్రేరేపిస్తుంది. దీనినే పూర్ణ కలశం లేదా పూర్ణ కుంభం అని కూడా అంటారు. ఈ కలశం దైవిక శక్తితో నిండి ఉంటుందట. కాగా బియ్యం శాంతికి చిహ్నం. ప్రతిరోజూ మన ఆకలిని తీర్చే ధాన్యానికి కృతజ్ఞత చూపించే మార్గంగా పూజకు ఉపయోగించే కలశం కింద బియ్యాన్ని పోస్తారు. ఈ నియమం ద్వారా మానవులకు ప్రయోజనకరమైన అన్ని వస్తువులను దైవిక రూపాలుగా హిందూ ధర్మం పరిగణిస్తుందని వాటిని దేవుని సన్నిధిలో ఉంచుతుందని తెలుస్తుంది. అలాగే అన్ని లోహాలలో రాగి ఉత్తమమైనది. దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాల కారణంగా రాగికి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది.

నీటిని రాగితో కలిపినప్పుడు ఒక రసాయన ప్రతిచర్య సంభవిస్తుందని, అనేక రకాల చర్మ వ్యాధులను నయం చేసే ఒక ప్రత్యేకమైన ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తుందట. అలాగే ఒక మంత్రాన్ని జపించేటప్పుడు అచ్చులు కొన్ని లయబద్ధమైన వైవిధ్యాలతో కూడిన మంత్రాలు, ప్రకృతిలోని విద్యుదయస్కాంత శక్తితో కలిసిపోతాయట. కలశం లోపల ఉంచబడిన పదార్థం ద్వారా శక్తి ఆకర్షించబడి కలశంలోకి ప్రవేశిస్తుందట. దీనినే పూర్వీకులు దేవుని సాన్నిధ్యం అని పిలిచేవారు. అటువంటి దైవిక సాన్నిధ్యం కోసం, మనం కలశం లోపల దర్భ గడ్డిని ఉంచుతారు.అదేవిధంగా మామిడి ఆకులలో అధిక స్థాయిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది ఎక్కువ ఆక్సిజన్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది అందరికీ తెలిసిన విషయమే.అందుకే శుభ కార్యక్రమాల కోసం ఇంట్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడం సర్వసాధారణం. కనుక మామిడి ఆకులు, అరటి ఆకులను అందరికీ అనుకూలమై ఆక్సిజన్ అధికంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగిస్తారు. పరమాత్ముడు కాంతి రూపంలో ఉన్నాడని నమ్మకం. కాంతి రూపంలో ఉన్న భగవంతుడిని కలశంలో ప్రార్థిస్తాము. ఆ కలశం కూడా దీపంలా కనిపిస్తుంది. కాగా కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అని అంటారు. అటువంటి పవిత్ర మైన కొబ్బరికాయలను దేవుడికి సమర్పించడం ద్వారా ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో మనం పూజలో కొబ్బరికాయలను ఉపయోగిస్తాము.

Exit mobile version