Site icon HashtagU Telugu

Tatvamasi: అయ్యప్ప సన్నిదిలో ఈ వాక్యాన్ని ఎందుకు రాస్తారు…తత్వమసి అంతరార్ధం ఏమిటి?

Tatvamasi

Tatvamasi

Tatvamasi: హరిహర సుతుడు అయ్యప్ప శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం . తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించి భక్త జన నీరాజనాలు అందుకుంటున్నాడు. ధర్మశాస్తగా పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మ నిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

తనను నమ్మిన భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు నియమ నిష్టలతో కూడిన ధర్మసూత్రాలు భక్తుల జీవితాలలో వెలుగులు నింపుతాయి. అయ్యప్ప మాలధరణలో బాగంగా మండల కాలంలో బ్రహ్మ చర్య దీక్ష చేపట్టడం మనం చూస్తూ ఉంటాం. దీక్ష చేపట్టిన భక్తులకు ఆత్మజ్ఞానాన్నికలిగింఛి సకల జీవులలో ఆ హరిహరపుత్రుని దర్శించే తత్వాన్ని రగిలించే మార్గం ఒకటుంది. ఆ సత్ గుణాలను చేకూర్చే తత్వమే తత్వమసి. శభరిమలలో అయ్యప్ప ఆలయంలో పదునెట్టాం పడి ఎదురుగా కనిపించే సన్నిధానం పైన తత్వమసి వాక్యం కనిపిస్తుంది.

హిందు సంప్రదాయంలో మమేకమై ఉన్న నమస్కారానికి ఈ తత్వమసికి ఉన్న అంతర్గత బంధం గురించి మన పురాణాలలో సైతం చెప్పడం జరిగింది. చేతులు జోడించి నమస్కరించడంలో ఉన్న పరమార్ధాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేసి మనమంతా ఒక్కటే అని చెప్పే ఈ నమస్కారం మూలమంత్రమే ఉపనిషత్ సారమైన తత్వమసి అనే మహా వాక్యం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.

We’re now on WhatsAppClick to Join

శభరిమల సన్నిధానంలో రాసిన ఈ వాక్యంలో దాగిన అతర్గత పరమార్ధం ఇదే. నలబై ఒక్క రోజుల కఠోర అయ్యప్ప దీక్షతో శభరిమల చేరుకున్న భక్తులకు పవిత్రపావన పదునెట్టాం పడి ఎక్కగానే ఆ స్వామిని చేరే క్రమంలో ముందుగానే మనకు దర్సనమిస్తుంది తత్వమసి అనే మహా వాక్యం. తత్వమసి అనేది సంస్కృత పదం. దీని అర్ధం వాడుక భాషలో చెప్పాలంటే అది నీవై ఉన్నావు అనే అర్ధం గోచరిస్తుంది. నువ్వు ఎ భగవంతుడి సన్నిధికి చేరుకున్నవో ఆ భగవంతుడు నీలో అంతర్యామియై ఉన్నాడు అని అర్ధం వచ్చేలా తత్వమసి మనకు బోధిస్తుంది. దీక్ష పూనిన ప్రతీ ఒక్కరు స్వామి సన్నిధి చేరుకోగానే ఈ మహావాక్యం తప్పకుండా చదువుతారు.

Also Read: Mall : మాల్‌లో క‌త్తిపోట్ల క‌ల‌క‌లం.. న‌లుగురి మృతి!