మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో అప్పుడప్పుడు దేవుళ్లకు సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు కలలో శివలింగం కానీ శివుడు కానీ కనిపించాడా. మరి అలా కనిపిస్తే దాని అర్థం ఏమిటి అలా కనిపించినప్పుడు ఏం జరుగుతుందో పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శివుడు లేదా శివలింగం కలలోకి రావడం అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ శివుడు కలలోకి రాడని చెబుతూ ఉంటారు. పరమేశ్వరున్ని నిత్యం పూజించే వారికి మాత్రమే ఇలాంటి అదృష్టం లభిస్తుందని చెబుతూ ఉంటారు.
అలాగే పూర్వ జన్మ సుక్రుతం వల్ల కూడా శివుడు కలలో కనిపిస్తాడని అంటారు. శివుడు కలలో కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. శివుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టి శివుడు మీకు కలలో కనిపిస్తున్నాడు. కొందరు మొక్కులను మొక్కుకొని మర్చిపోతూ వుంటారు. ఇలాంటి సందర్భంలో కూడా ఆ మొక్కులను గుర్తుచేయడానికి శివుడు కలలోకి వస్తాడని అంటున్నాrరు పండితులు. శివలింగం కలలో కనిపిస్తే మోక్షాన్ని పొందుతారట. శివలింగం కలలోకి వచ్చింది అంటే శివుడు దర్శనం ఇచ్చాడని దాన్ని అదృష్టంగా భావించాలి అంటున్నారు పండితులు. అలాగే పరమేశ్వరుడు కలలో కనిపిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని చెబుతున్నారు.
అలా కనిపించడం శుభసంకేతంగా భావించాలట. అలాగే ఎవరైనా పడుకునే ముందు పీడకలలు లాంటివి రాకూడదు అంటే ఓం నమః శివాయ అని జపించి పడుకోవడం మంచిదని చెబుతున్నారు. ఒకవేళ కలలో శివలింగం కనిపిస్తే రాబోయే జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని అర్థమట. మీకు ఏవైనా సమస్యలు ఉంటే అవి త్వరలోనే తీరిపోతాయని అర్థం అంటున్నారు పండితులు. ఒకవేళ శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు కల వస్తే మీరు పోయిన జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు తీరిపోవడానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు పండితులు. గర్భిణీ స్త్రీలకు కలలో శివలింగం కనిపిస్తే వారికి ఇష్టమైన సంతానం కలగబోతోందని అర్థమట. కలలో శివలింగంపై నాగుపాము వున్నట్లు కనబడితే మంచి జరుగుతుందని అది ధనప్రాప్తికి సంకేతం అంటున్నారు పండితులు. ఒకవేళ కలలో తెలుపు రంగు శివలింగం కనిపిస్తే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అంటున్నారు పండితులు.