Site icon HashtagU Telugu

Dream: మీకు కలలో శివలింగం మీద శివుడు కనిపించాడా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Shiva Puja Tips

Shiva Puja Tips

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డకలలు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తుని సూచిస్తాయి అని అంటూ ఉంటారు. అంటే మనకు వచ్చే కలలను బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అయితే కలలో కొంతమందికి శివలింగం కనిపిస్తే మరి కొందరికి శివుడు కనిపిస్తూ ఉంటాడు. అయితే శివుడు కనిపిస్తే కొంత మంది సంతోష పడితే మరి కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు శివుడు, లేదంటే శివలింగం కలలో కనిపిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శివుడు, లేదా శివ లింగం కలలోకి రావడం మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం వుంటే గానీ శివుడు కలలోకి రాడని చెబుతున్నారు. శివుడని నిత్యం పూజించే వారికి ఈ భాగ్యం కలుగుతుందని అంటున్నారు. పూర్వ జన్మ సుక్రుతం వల్ల కూడా శివుడు కలలో కనిపిస్తాడని అంటారు. అయితే శివుడు కలలో కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదట. శివుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టే శివుడు మీకు కలలో కనిపిస్తున్నాడట. కొందరు మొక్కులను మొక్కుకొని మర్చిపోతూ వుంటారు. ఇలాంటి సందర్భంలో కూడా ఆ మొక్కులను గుర్తు చేయడానికి శివుడు కలలోకి వస్తాడని అంటున్నారు. శివలింగం కలలో కనిపిస్తే మోక్షాన్ని పొందుతారని సంకేతంగా పండితులు చెబుతున్నారు.

శివుడిని దర్శించడానికి ఎన్నో కిలో మీటర్ల ప్రయాణిస్తాము. అలాంటిది శివుడే నేరుగా కలలోకి వచ్చి దర్శనమిచ్చాడంటే దానిని అదృష్టంగా భావించాలని అంటున్నారు. శివుడు కలలో కనబడితే ఐశ్వర్యవంతులవుతారని పండితులు చెబుతున్నారు. అది శుభానికి సంకేతంగా భావించాలట. ఆరోగ్యవంతులై, సంపూర్ణ ఆయుష్షు కూడా లభించిన వారవుతారని చెబుతున్నారు. పడుకునే ముందు ఓం నమ:శివాయ అని జపించి పడుకుంటే ఎలాంటి భయంకరమైన కలలు రావని, మంచి కలలు వస్తాయని చెబుతున్నారు. శివలింగాన్ని కలలో చూసినట్టయితే రాబోయే మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతున్నాయని అర్థం. మీకు ఏ సమస్యలు ఉన్నా రాబోయే రోజుల్లో అవి తీరిపోతాయని అర్థం. మీ జీవితంలో ఏదైనా నెగటివ్ ఎనర్జీ వుంటే అది కూడా తొలగిపోతుందని అంటున్నారు. శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టు కల వస్తే మీరు పోయిన జన్మలో చేసిన పాపాలు, లేదంటే ఈ జన్మలో చేసిన పాపాలు తీరిపోవడానికి సంకేతాలుగా భావించాలని పండితులు చెబుతున్నారు. గర్భిణులు తమ కలలో శివలింగాన్ని గనుక చూసినట్లయితే వారికి ఇష్టమైన సంతానం కలగబోతోందని అర్థం.

కలలో బిల్వపత్రంతో, లేదంటే లింగానికి అభిషేకం చేస్తున్నట్టు కలవస్తే మీ ఆరోగ్యం చాలా బాగుండబోతోందని సంకేతం. పాడైపోయిన నీరుతో శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు కలలో వచ్చినా లేదా శివలింగం పగిలిపోయినట్టు కల వచ్చినా అది మంచి కల కాదని చెబుతున్నారు. ఇలా కలవస్తే రాబోయే రోజుల్లో డబ్బు ఖర్చయిపోయి, ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు వున్నాయట. కలలో శివలింగంపై నాగుపాము వున్నట్లు కనబడితే మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం అంటున్నారు. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలూ తీరిపోతాయని అంటున్నారు. కలలో తెల్లరంగులో ఉన్న శివలింగ కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ పేరు ప్రతిష్టలు బాగాపెరిగే అవకాశం వుందని చెబుతున్నారు.