Site icon HashtagU Telugu

Pradakshina:గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి.. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలుసా?

Monk

Monk

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తరచూ దేవాలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చేస్తుంటారు.

ఈ విధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా మనలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.అయితే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గర్భగుడిలోని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే సందేహం పడుతుంటారు. అయితే కొందరు 3,5,7,9,11,21 ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరికొందరు మొక్కుబడిగా 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

సూర్యభగవానుడికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే సమయంలో ప్రతి ఒక్కరు తప్పకుండా 18 ప్రదక్షిణలు చేయాలి. సోమవారం పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళిన వారు 18 ప్రదక్షణలు, అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 21 ప్రదక్షణలు చేయాలి. బుధవారం వినాయకుడి ఆలయానికి వెళ్లేవారు 27 ప్రదక్షిణలు చేయాలి. గురువారం సాయిబాబా మందిరం దర్శించే వారు స్వామి వారి ఆలయం చుట్టూ 17 ప్రదక్షణలు చేయడం మంచిది.

శుక్రవారం దుర్గామాతకు ఎంతో ప్రత్యేకమైన రోజు కనుక నేడు అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో పవిత్రమైన రోజు స్వామివారి ఆలయం చుట్టూ 21 ప్రదక్షణలు చేయాలి.అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు శనీశ్వరుని ఆలయం చుట్టూ కూడా 18 ప్రదక్షిణాలు చేయాలి.

ఈ విధంగా మీకు ఇష్టమైన రోజు ఇష్ట దైవాన్నిఆరాధిస్తూ ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవటం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉండి మనకు సకల సంపదలు కలిగిస్తాడని భావిస్తారు.