Site icon HashtagU Telugu

Dried Tulsi Plant: ఎండిపోయిన తులసి మొక్కను పడేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

Dried Tulsi Plant

Dried Tulsi Plant

మామూలుగా హిందువుల ప్రతి ఒక్కరి ఇండ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు చేయడంతో పాటు దేవతగా కొలుస్తూ ఉంటారు. ప్రతి హిందూ కుటుంబం తులసిని తమ ఇంటి ముంగిట్లో పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయితీ. అయితే తులసి మొక్క కూడా కొన్ని రోజులే కళకళలాడుతుంది. కొన్నాళ్ల తరువాత వాడిపోయి ఎండిపోతుంది. అందుకే చాలామంది ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి మొక్కను మారుస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క ఎండినప్పుడు దానిని చాలా మంది పడేస్తారు.

తులసి ఔషద గుణాల గురించి అవగాహన ఉన్నవారు తులసి ఆకులను నిల్వచేసుకుంటారు. కానీ తులసి చెక్కను, తులసి చిన్న చిన్న కొమ్మలను పడెస్తుంటారు. కానీ అలా పడేయకుండా ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అయితే తులసినే కాదు. ఎండిన తులసి కూడా పవిత్రమే. సాధారణంగా ఎండిన తులసి చెక్కతో తులసి మాలలు తయారు చేస్తుంటారు. కానీ ఇంట్లో ఎండిపోయిన తులసి చెక్కను పడేయకూడదట. తులసి చెక్కను ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుందట.

అలాగే వాస్తు ప్రకారం ఎండిన తులసి చెక్కను ఇంట్లో ఉంచితే ధన ఆకర్షణ కూడా పెరుగుతుందట. వ్యాపారాలలో లాబాలు కూడా తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. ఎండిన తులసి చెక్కను ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచాలి. దీని వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందట. అప్పుల సమస్యతో బాధపడేవారికి ఆ సమస్య నుండి ఉపశమనం కూడా లభిస్తుందట. ఎండిన తులసి చెక్కను భద్రపరచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగుతుందని అంటున్నారు. ఎండిపోయిన తులసి మొక్కను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదట.