Mudupu: దేవుడికి ముడుపు ఎందుకు కడతారో తెలుసా?

దేవుడికి మొక్కు చెల్లించేందుకు కొంత డబ్బును ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియను ముడుపు కట్టడం అంటుంటారు.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 07:30 AM IST

దేవుడికి మొక్కు చెల్లించేందుకు కొంత డబ్బును ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియను ముడుపు కట్టడం అంటుంటారు. అది ఆ దేవుడికి అంకితభావంతో చేసే నివేదన. ఇబ్బుందుల నుంచి గట్టెక్కడం కోసం, ధర్మబద్దమైన కోరిక నెరవేరడం కోసం ఇష్టదైవం పేరుతో ముడుపు కట్టే సంప్రదాయం ఉంది. దైవ దర్శనం తర్వాత…మనసులోని కోరిక చెప్పుకుని ఆలయ ప్రాంగణంలోని దేవతా చెట్టుకు దీన్ని కడతారు. కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గరే ముడుపు కట్టి…ఆలయానికి వెళ్లినప్పుడు…దాన్ని చెట్టుకు కానీ, నిర్దేశించిన ప్రాంతంలో కానీ కడుతారు.

ముడుపు ఎలా కట్టాలి..?
ముడుపు కట్టేముందు దీపారాధన చేయాలి. వినాయకుడిని పూజించి, ఇష్టదైవాన్ని ప్రార్ధించాలి. ఇప్పుడు పసుపులో తడిపి ఆరబెట్టిన వస్త్రాన్ని కుంకుమతో అలంకరించి…అందులో కొబ్బరికాయ, యథాశక్తి డబ్బులు ఉంచాలి. ముడుపు కడుతున్న కారణాన్ని మనస్పూర్తిగా దైవానికి చెప్పుకోవాలి. తర్వాత మూడు ముడులు వేసి ముడుపు కట్టాలి. అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ముడుపుతో దర్శనానికి వస్తానని మెుక్కుతుంటారు. కోరిక నెరవేరిన తర్వాత…ఆ ముడుపును ఆలయానికి వెళ్లి దేవుడికి చెల్లించి మొక్కు తీర్చుకోవాలి. అయితే ముందుగానే ఆలయాల్లో ముడుపు కట్టినప్పుడు..అనుకున్న కార్యం నెరవేరిన తర్వాత మళ్లీ దైవ దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంటుంది.