Rama- Krishna Tulsi: కృష్ణ తులసి, రామ తులసికి తేడా, వాటిలో ఏ తులసిని ఇంట్లో నాటాలంటే?

హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తితో పూజలు కూడా చేస్తూ

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 06:30 PM IST

హిందువుల ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తితో పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో కొందరు రామ తులసి మొక్కను పెంచుకుంటే, కొందరు కృష్ణ తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. ఈ రెండింటిలో ఏది మంచిది. దేనిని ఇంట్లో పెంచుకోవాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తులసి మొక్క నాటిన ఇంట్లో విష్ణువు ఉంటాడని నమ్ముతారు. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. తులసిలో రామ, కృష్ణ తులసి అని రెండు రకాలు ఉన్నాయి.

ఈ రెండు తులసిలకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు తులసి మొక్కలకు వ్యత్యాసం ఏంటంటే.. రామ తులసి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. కృష్ణ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉంటాయి. రామ తులసి ఆకుల రుచి మధురంగా ​​ఉంటుంది, అయితే కృష్ణ తులసి ఆకుల రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. రామ తులసికి ఘాటైన వాసన ఉంటే, కృష్ణ తులసికి కొంచెం తీపి వాసన ఉంటుంది. తులసి రెండింటి లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి.. మరి ఈ రెండు మొక్కల ప్రాముఖ్యత విషయానికి వస్తే.. రామ తులసి రాముడికి ప్రీతికరమైనది. కృష్ణ తులసి శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనది.

రామ తులసిని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కృష్ణ తులసిని ఔషధ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో తులసి రెండు నాటడం శుభప్రదంగా భావిస్తారు. రామ తులసి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కృష్ణ తులసి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ మొక్కను ఆదివారం,ఏకాదశి, గురు, శుక్ర, గ్రహణ రోజులో తులసి మొక్కను తాకకూడదు. రామ తులసిని ఏ దిశలో నాటాలి? అన్న విషయానికి వస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం రామ తులసిని తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి. దేవతలు ఈ దిశలలో నివసించినట్లు భావిస్తారు. కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు. తులసిని నాటేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ దిశలలో తులసిని నాటడం వల్ల ఇంటికి సంపదలు చేకూరుతాయి.