Vinayaka Chavithi Date : వినాయక చవితి .. తేదీ ఎప్పుడు ? పండుగను ఈ నెల 18న జరుపుకోవాలా ? 19న జరుపుకోవాలా ? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ప్రతి సంవత్సరం మనం భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. అందుకు భిన్నంగా ఈసారి సెప్టెంబరు 18, 19 తేదీల్లోనూ చవితి తిథి వచ్చింది. దీంతో ఫెస్టివల్ ను ఏరోజున జరుపుకోవాలన్న దానిపై డౌట్ ఏర్పడింది. అయితే దీనిపై సిద్దిపేట జిల్లాలోని వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో నెల క్రితమే 100 మంది సిద్ధాంతులతో చర్చించి పండుగ తేదీపై ఓ నిర్ణయం తీసుకొని, తెలంగాణా ప్రభుత్వానికి నివేదించారు. ఆ సిఫారసు మేరకే ఈనెల 18వ తేదీని వినాయక చవితికి అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.
Also read : Antacid Digene : డైజీన్ సిరప్ తాగుతున్నారా..? అయితే మీరు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే..
ఇక వెయ్యేళ్ల చరిత్ర కలిగిన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా ఈ నెల 18నే పండుగ జరుపుకోవాలని కోరింది. ఈనెల 18న (సోమవారం) ఉదయం 10:15 నిమిషాల నుంచి ఈనెల 19న ఉదయం 10:43 నిమిషాల వరకు వినాయక చవితి పండుగ తిథి ఉంటుందని పండితులు తెలిపారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా ఈ నెల 18 నుంచే ప్రారంభమవుతాయి. గతంలో 2000, 2009, 2010, 2019 సంవత్సరాల్లో కూడా తిథి విషయంలో ఇలాంటిదే సందిగ్ధం ఏర్పడితే.. తదియతో కూడిన చతుర్ధినే వినాయక చవితిగా జరుపుకున్నారని పండితులు (Vinayaka Chavithi Date) గుర్తు చేశారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.