Brahmapadhartha : ‘నవ కళేబర’ యాత్ర అనేది ఒడిశాలోనీ పూరీలో ఉన్న జగన్నాథుడి ఆలయంలో జరిగే కీలక ఘట్టం. అధిక ఆషాఢ మాసంలో ఈ ఘట్టాన్ని నిర్వహిస్తుంటారు. అధిక ఆషాఢ మాసం అనేది ప్రతి 8, 11, 19 ఏళ్లకోసారి వస్తుంది. ఇంతకీ ఈ ఘట్టంలో ఏం చేస్తారు ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
నవ కళేబర యాత్రలో భాగంగా పూరీ జగన్నాథుడి ఆలయం గర్భగుడిలో ఉండే విగ్రహాలను(Puri Jagannath Statue) భూస్థాపితం చేసి.. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రవేశపెడతారు. అధిక ఆషాడమాసంలో మాత్రమ ఈ కీలకమైన ప్రక్రియను నిర్వహిస్తారు. జగన్నాథుడి పాతవిగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాత విగ్రహాలలో ఉండే ఓ బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహాలలోకి ప్రవేశపెడతారు. పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలలోకి బ్రహ్మపదార్థాన్ని మార్చడం అనేది ఓ ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త విగ్రహాలను పూరీ జగన్నాథుడి ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించడానికి నలుగురు పెద్దలు వెళ్తారు.
ఆ రోజు గర్భగుడిలో జరిగేది ఇది..
తరతరాలుగా ఓ వంశానికి చెందినవారే ఈ విగ్రహాలలోని బ్రహ్మపదార్థాన్ని మారుస్తున్నారు. ఆ వంశంలోని అతిపెద్ద వయస్కుడు మాత్రమే ఈ పవిత్ర క్రతువులో పాల్గొంటారు. ఆ వ్యక్తి నడుముకు తాడు కట్టి చివర్లో ఓ గంట కడతారు. కళ్లకు గంతలు కట్టి ఆలయం లోపల విగ్రహాల దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెడతారు. ఆ టైంలో పూరీ నగరం మొత్తంలో కరెంటును కట్ చేస్తారు. అదే సమయంలో ఆలయం గర్భగుడిలోకి వెళ్లిన వ్యక్తి తన పనిని మొదలు పెడతాడు. జగన్నాథుడి పాత విగ్రహానికి గుండె ప్రదేశంలో చిన్న తలుపులాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని తీసి లోపల ఉన్న బ్రహ్మపదార్థాన్ని(Brahmapadhartha) కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సదరువ్యక్తి గంట వాయిస్తాడు. అప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టిస్తారు. పాతవిగ్రహాలను భూస్థాపితం చేస్తారు.
Also Read :2 Lakhs Loan Limit : ఇక కొత్త లోన్ లిమిట్.. అంతకుమించి లోన్ ఇవ్వరు!
పూరీ జగన్నాథుడి విగ్రహంలో శ్రీ కృష్ణుడి గుండె ఉందనే ప్రచారం జరుగుతుంటుంది. అయితే అది అవాస్తవమని పరిశీలకులు అంటున్నారు. జర అనే వేటగాడు పక్షి అనుకుని వేసిన బాణం తగిలి శ్రీ కృష్ణుడు అవతారాన్ని చాలించాడు. తాను ఈ బాణం వేసినందుకు వేటగాడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చి.. కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. అంటే కృష్ణుడి గుండె ఇంకా భౌతికంగా అందుబాటులో ఉందనే ప్రచారం అవాస్తవం.