Gomedhikam : విదేశాల్లో డబ్బు సంపాదనకు వెళ్తున్నారా..అయితే ఈ రత్నం ధరిస్తే డబ్బే డబ్బు…!!

గోవును పోలి ఉండేది గోమేధికం, గోమేధికం గోమూత్రం రంగులో ఉంటుంది. అలాగే తేనె రంగులో మెరుస్తుంది. కొన్ని సందర్భాల్లో తెలుపు రంగులో ఉండి కూడా మెరుస్తుంటుంది.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 08:00 AM IST

be గోమేధికం నదీ ప్రవామాలలో కొట్టుకొని వస్తాయి. ఇది స్ఫటిక జాతికి చెందిన రత్నం.

మచ్చలు, చారలు, కాంతిహీనం ఉన్న గోమేదికం ధరించరాదు. వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవిస్తాయి. గోమేధిక రత్నాలు హిమాలయాల్లోని నదుల తీరంలోనూ, శ్రీలంకలో లభ్యం అవుతాయి. ఇందులో రకాలు ఉన్నాయి. సూర్యకాంత గోమేధికం సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్నిజ్వాల లాగా వెలిగిపోతుంది. హిమాలయ పర్వత ప్రాంతములలో లభ్యమగు చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించిన పౌర్ణమి చంద్రుని లాగా, తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి, ఒకవైపు నుండి చూచిన రెండోవైపు కనపడే స్ఫటిక లక్షణాలకు కలిగిన రత్నాలు అత్యంత శ్రేష్ఠమైనవి.

ఆయుర్వేదశాస్త్రం ప్రకారం గోమేధికం ధరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలగు వ్యాధుల నుండి విముక్తి కలుగును.

గోమేధికం ఎవరు ధరించాలి..
>> ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారు గోమేధికం ధరించవచ్చు.
>> గోమేధికానికి అధిపతి రాహువు. , రాహు దశలో ఉన్నవాళ్ళు గోమేధికం ధరించటం చాలా మంచిది.
>> భూత ప్రేత పిశాచముల బాధలు అనుభవించే వారు గోమేదికం ఉంగరంలో ధరిస్తే భాదల నుండి విముక్తి కలుగుతుంది.
>> గోమేదికం ధరిస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు. ధనప్రాప్తి కలుగును. రోగములు కలగకుండా కాపాడగలదు.
>> విదేశాల్లో డబ్బు సంపాదించడానికి వెళ్లేవారికి ఉత్తమమైన రత్నం గోమేధికం.