Site icon HashtagU Telugu

Aishwarya Kali Deepam: ఇంట్లో, చేతిలో డబ్బు నిలవడం లేదా.. అయితే ఐశ్వర్య కాళీ దీపం పెట్టాల్సిందే?

Mixcollage 08 Jul 2024 07 13 Pm 2376

Mixcollage 08 Jul 2024 07 13 Pm 2376

మామూలుగా కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదని చెందుతూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు మిగలాలన్నా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలన్న తప్పనిసరిగా ఐశ్వర్య కాళీ దీపం పెట్టాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఐశ్వర్య ఖాళీ ఎలా పెట్టాలి? ఆ దీపం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత,శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలు ఉన్న ఫోటో పెట్టాలి.

ఈ ఫోటో పెట్టడం వల్ల సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి. ఈశాన్య ములలో రాగి చెంబులో నీళ్ళను నిడుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచం పసుపు, కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచాలి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి. అలాగేనెలకి ఒకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడికాయ లేదంటే పూజించిన కొబ్బరికాయ రంగు వస్త్రంలో కట్టి వేలాడదీయాలి. వారానికి ఒక్కసారి అయినా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. చేతిలో డబ్బులు మిగడం లేదు అప్పులు ఎక్కువ అవుతున్నాయి అనుకున్న వారు ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు, కుంకుమ రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు, కుంకుమ, పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.

అలాగే పళ్ళు పాలు పటిక బెల్లం కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీ వెంకటేశ్వర స్తోత్రం కానీ కనకధార స్తోత్రం గాని చదివితే మంచిది. శుక్రవారం రోజు పెట్టిన దీపాలను శనివారం రోజు తీసివేసి ఆ ఉప్పును నీటిలో కలపాలి. ఒకవేళ కుదరనే వారు ఎవరు తొక్కని ప్రదేశంలో బయటపడేయాలి. అన్నిటి కంటే నీళ్లలో వేయడం సరైన పద్ధతి అని చెప్పవచ్చు. ఆ ప్రమిదలను మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ చేయడం మంచిది. ఈ ఉప్పు దీపం ఈశాన్యం భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది, అంటే పూర్తీ ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారం ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి.