Site icon HashtagU Telugu

Sashtanga Namaskar : దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ధ్వజస్థంభం వద్దే ఎందుకు చేయాలి..?

Sastanganamaskar

Sastanganamaskar

సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి…ఎలా చేస్తారు. దేవాలయానికి వెళ్లిన చాలా మంది భక్తులు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. దైవానికి ఎదురుగా నిలుచుని చేతులు సాచి దేహాన్ని పూర్తిగా నేలకు తాకిస్తూ సష్టాంగంగా నమస్కారం చేస్తారు. అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజ స్తంభం వద్దే చేయాలన్ని నియమం ఒకటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది.

సాష్టాంగ నమస్కారం ధ్వజ స్తంభం వద్ద చేయడం వల్ల…ఆ నమస్కారం తప్పకుండా ప్రధాన దైవానికి చేరుతుందన్న నమ్మకం. అంతేకాదు సాస్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ల భాగం దిశలో దేవతా మూర్తులు ఉండరు. ఆలయంలోని ముఖమంటపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్లు ఉపాలయాలు వైపున ఉంటాయి. అందుకే ఎలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు, ఉపాలయాల వైపు కాళ్లు పెట్టకుండా ఉండేందుకు కోసం ధ్వజస్తంభం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయాల్సి ఉంటుంది.