మామూలుగా చాలామంది దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. మనిషికి నర దిష్టి తగిలిందని ఇంటికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. అయితే ఇలా దిష్టి తగలకుండా ఉండడం కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మనుషులకు దిష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఒకవేళ దిచితగిలితే ఉప్పు లేదా చీపురు చెప్పులు వంటి వాటితో దిష్టి తీస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలా ప్రదేశాలలో ప్రాచీన పద్ధతులను పాటిస్తూ వస్తున్నారు. నిజానికి దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తే దిష్టి పోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లోనే ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు కొద్దిగా గల్ల ఉప్పు తీసుకుని వారి చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పును నిప్పుల్లో పడవేయండి. లేదంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో పడేయవచ్చని చెబుతున్నారు.
అయితే ఇది కేవలం ఇంట్లోని పెద్దవారితో మాత్రమే చేయించాలని చెబుతున్నారు. ఇక పురుషులు నలుపు రంగు మొలతాడు కట్టుకోవడం వల్ల దిష్టి సమస్య నుంచి బయటపడవచ్చట. ఇక ఇంటికి దిష్టి తగిలింది అనుకుంటే ఒక రాగి చెంబు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులను వేయాలి. తర్వాత ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి. ఆ నీటిని మీ పూజ గదిలో పెట్టి ఇష్ట దైవానికి పూజ చేసి ఆ తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లడం వల్ల దిష్టిపోతుందట. అలాగే కొన్ని నిప్పులను తీసుకొని వాటిపై కొంచెం ఇంగువ వేసి వాటి నుంచి వచ్చే పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలి. ఇలా ధూపం వేసినట్టుగా ఇల్లు మొత్తం పొగను చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట.
దిష్టి కూడా తగ్గుతుందట. ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఆ ఇంటికి నర దిష్టి తగలదని చెబుతున్నారు. అదేవిధంగా ఒక నల్లటి తాడుకి ఒక బాగా పండిన నిమ్మ పండు కొన్ని పచ్చిమిర్చి గుచ్చి వాటిని ఇంటి ముందు వేలాడదీయాలి. ఇవి ఎలాంటి దృష్టిని అయినా సరే ఆకర్షిస్తాయి. అవి ఎండిపోయిన తర్వాత వాటిని మారుస్తూ ఉండడం వల్ల మీ ఇంటికి పట్టిన దిష్టి తొలగిపోతుంది.