Black Bangles: బ్లాక్ కలర్ గాజులు వేసుకోకూడదా.. వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

హిందువులు ఎక్కువగా ఉపయోగించిన రంగులలో నల్ల రంగు కూడా ఒకటి. నలుపు రంగు వస్తువులను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. నలుపు రంగును

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 11:02 AM IST

హిందువులు ఎక్కువగా ఉపయోగించిన రంగులలో నల్ల రంగు కూడా ఒకటి. నలుపు రంగు వస్తువులను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. నలుపు రంగును కీడుగా, నెగిటివ్ గా భావిస్తారు. ముఖ్యంగా శుభకార్యాల సమయంలో నలుగురంగు దుస్తులను ధరించడానికి ఇంట్లోని పెద్దవారు కూడా అసలు ఒప్పుకోరు. ఇక పెళ్లి అయిన స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులు కానీ నలుపు రంగు ఉన్న గాజులు కూడా ధరించడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నలుపు రంగును వాడటం వల్ల చెడు దృష్టి పడుతుందని విశ్వాసం.

కానీ ఈ మధ్యకాలంలో కాలం మారిపోవడం తో ఫ్యాషన్, మ్యాచింగ్ ల పేర్లతో చాలామంది నల్ల రంగు గాజులు నలుపు రంగు దుస్తులు వేసుకుంటున్నారు. అయితే అసలు నలుపు రంగు దుస్తులు గాని నలుపు రంగు గాజులు గాని ఎందుకు ధరించకూడదు అలా ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా చోట్ల చాలా మంది పెళ్లి అయిన నవ వధువులు నల్ల గాజులు వేసుకుంటారు. ఎందుకంటే ఈ రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇది నెగిటివిటీని తొలగిస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. అందుకే చాలా చోట్లు నవ వధువులు నల్ల గాజులను వేసుకుంటుంటారు. అలాగే చాలా చోట్ల పెళ్లైన తర్వాత నవ వధువులు ఎరుపు గాజులతో కలిపి నల్ల గాజులను ఆడవాళ్లు వేసుకుంటుంటారు.

దీని వల్ల మహిళల దాంపత్య జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మహిళలు తమ చేతుల్లో నల్ల గాజులను వేసుకుంటే అది వారి భర్తను చెడు కన్ను నుంచి కాపాడుతుంది. భర్తను సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు. కానీ ప్రదేశాల్లో మాత్రం నలుపు రంగు అశుభంగా భవిస్తారు. అందులోనూ ఆడవాళ్లు అస్సలు వేసుకోకూడదని అంటారు. పెళ్లైన ఆడవాళ్లు కొన్ని రోజుల పాటు ఎరుపు, గ్రీన్ కలర్ గాజులు తెప్పించి.. నల్ల గాజులను అస్సలు వేసుకోకూడదు. నలుపు రంగు ఆడవారికి అస్సలు మంచిది కాదని చెబుతూ ఉంటారు.

Follow us