Site icon HashtagU Telugu

Hindu Sastra: అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 11 Jul 2024 09 54 Am 7321

Mixcollage 11 Jul 2024 09 54 Am 7321

ఈ మధ్యకాలంలో మనుషులకు చాదస్తాలతో పాటుగా మూఢ నమ్మకాలు పెరిగిపోయాయి. కొందరు మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తికమక పెడుతున్నారు. లేనిపోని అనుమానపు బీజాలను మనుషుల మనసులలో నాటుతున్నారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లకూడదని, చనిపోయిన వారి శవాన్ని తాకి నమస్కారం చేయకూడదని, స్మశానంలోకి వెళ్లకూడదని, వెళ్తే దుష్ట శక్తులు శరీరంలోకి ఆవహిస్తాయని ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు. ఇతరుల మాటలు నమ్మి చాలా మంది వీటిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు.

అయితే ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలే అంటున్నారు పండితులు. వీటిలో ఎలాంటి వాస్తవం సత్యం లేదని చెబుతున్నారు. మరి నిజంగానే అందరూ అనుకుంటున్నట్టుగా అంత్యక్రియల్లో శవాన్ని తాకకూడదా,తాకితే ఏం జరుగుతుంది ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరణం ప్రతీ వ్యక్తికీ భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్లి వారికీ ధైర్యం చెప్పాలి. పుట్టిన ప్రతీ ఒక్కరూ మరణించాల్సిందే, ఎవ్వరూ శాశ్వతంగా భూమి మీద వుండరు. అలాగే మీకు తోచినంతలో మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి. వాళ్లతో పాటే దహన సంస్కారాలు అయ్యే వరకూ అక్కడే వుండాలి. కుదిరితే ఆ శవాన్ని కూడా మోయాలి మోయవచ్చు కూడా అంటున్నారు పండితులు.

కేవలం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే భర్త శవాన్ని మోయకూడదట. మిగతా సమయాలలో భర్త ఎలాంటి అభ్యంతరం లేకుండా శవాన్ని మోయవచ్చట. అనాథ శవాలకు దహన సంస్కారం చేసినట్లయితే అది అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం ఇస్తుందట. ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చట. కానీ ఇంటికి వచ్చిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి. ఇంటి బయటే నీళ్లల్లో చిటికెడు పసుపు, కాస్త గోమూత్రాన్ని వేసుకొని, స్నానం చేస్తే ఏ దోశం వుండదట. అలాగే చనిపోయిన తరువాత తద్దినాలలో భోజనం చేయవచ్చు. అలా భోజనం చేయకూడదని శాస్త్రంలో లేదని పండితులు చెబుతున్నారు. అక్కడ పెట్టిన భోజనాలు పితృ దేవతా సమానం. అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి పేరుమీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది. రాగి తట్ట, రాగి చెంబు, ఇత్తడి చెండు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఇవి చేయలేకపోతే వస్త్రదానం చేయాలి. చనిపోయినవారి ఘ్నాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చలా మంచిదని పండితులు చెబుతున్నారు. కాబట్టి అంత్యక్రియల్లో శవాన్ని తాకినా కూడా ఏమి జరగదని పండితులు చెబుతున్నారు.