Site icon HashtagU Telugu

Morning: ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి ఊడిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Morning

Morning

మాములుగా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతూ ఉంటారు. శుభోదయం కాకముందే నిద్రలేచి వెంటనే శుభ్రం చేసుకుని ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఇంటిని సకాలంలో శుభ్రపరిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రేవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే మరి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి కల్లాపు చల్లి వాకిటి ముందు ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట.

కాగా కొందరు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజూ పూజలు చేస్తుంటారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబంపై ఉంటుందట. అలాగే ఉదయం లేవగానే చాలా మంది ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తుంటారు. అయితే ముందు వాకిలిని శుభ్రం చేసుకుంటే నెగెటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి బయటకు వెళ్లి పోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందట. కాగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే చీపురు పట్టుకుని వాకిలి, ఇల్లు ఉడవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అమ్మవారి దయ వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదట. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చడం లాంటివి చూసినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. ఇలా ఊడవడం చూసినప్పుడు మీరు వెళుతున్న పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారట. అలాగే పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం వల్ల పేదరికం మీ దరిదాపుల్లో ఉండదని చెబుతున్నారు. ఇది పేదరికం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుందట. అలాగే ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఉదయాన్నే లేచి వాకిలి, ఇల్లు ఊడ్చడం వల్ల ఇంట్లోని నెగిటివిటీ పోతుందని చెబుతున్నారు. ఇంట్లో గొడవలు, కొట్లాటలు జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుందట. ఇది ఇంటి సభ్యులందరినీ ఒకరినొకరు ప్రేమగా ఉంచుతుందని పండితులు చెబుతున్నారు.