Coconut: దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందా.. అయితే జరగబోయేది ఇదే?

  • Written By:
  • Updated On - February 22, 2024 / 04:12 PM IST

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరికాయను కొట్టిన తర్వాతే శుభకార్యాలను మొదలు పెడుతూ ఉంటారు. ఇక దేవుళ్లకు కొబ్బరికాయ కొట్టడం వెనుక మానవ జీవితంతో అనుబంధమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. భగవంతుడికి పూజ చేసిన తర్వాత తప్పనిసరిగా కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. అయితే ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు రకరకాలుగా పగలడం లేదంటే కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొబ్బరికాయ మధ్యలో నుంచి పువ్వు కూడా వస్తూ ఉంటుంది.

అయితే కొబ్బరికాయ కొట్టడం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అనాదిగా మన పూర్వీకుల నుండి వచ్చిన ఆనవాయితీ. కొబ్బరికాయను మనిషితో పోల్చి కూడా చెబుతారు. కొబ్బరికాయ పైన ఉండే పీచును జుట్టుగా, కొబ్బరికాయని మనిషి శరీరం గా, అందులో ఉండే నీటిని మన రక్తం గా చెప్పి టెంకాయ కొట్టిన తర్వాత వచ్చే కొబ్బరిని మనసుగా భావించి భగవంతుని ముందు నివేదిస్తే మనసులో ఉన్న అన్ని రాగద్వేషాలు తొలగిపోతాయని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే భగవంతుని ముందు కొబ్బరికాయలను తప్పనిసరిగా కొడతారు. అయితే చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అరిష్టంగా అశుభంగా, కీడు జరగబోతోంది అనడానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు.

కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు మనసులో దిగులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. కానీ అలా దిగులు చెందాల్సిన పని లేదు అంటున్నారు పండితులు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్మలమైన మనసుతో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని తిరిగి పూజను కొనసాగించవచ్చట. కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని భయాందోళనకు గురయ్యే వారు అది కేవలం అపోహ మాత్రమే అని పండితులు తెలిపారు.