శంఖు పుష్పాలు లేదా అపరాజిత పుష్పాలు. ఈ మొక్కలు మనకు చాలామంది ఇల్లు దగ్గర పెంచుకుంటూ ఉంటారు. పల్లెటూరు, చిన్న చిన్న గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ఈ అపరాధిత మొక్కలు విరివిగా లభిస్తూ ఉంటాయి. అయితే ఈ పుష్పాలు మనకు తెలుపు నీలం రంగులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. వీటిని పూజలో ఉపయోగించడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే చాలామంది అపరాజీత పుష్పాలను ఏదేవులకు సమర్పించాలో తెలియక కాస్త తికమక పడుతూ ఉంటారు. ఈ పువ్వులు విష్ణువు లేదా శనీశ్వరుడికి చాలా ప్రీతికరం.
అలాగే పరమేశ్వరుడికి కూడా ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ దేవుళ్లను ఈ పువ్వులతో పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయట. అలాగే ఆయా దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుందట. ముఖ్యంగా ఏవైనా పనులు తలపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే శంఖు పుష్పాలతో శనీశ్వరుడిని పూజించాలట. విధంగా చేస్తే మీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయట. పనులు ముందుకు సాగుతాయట. పూజ చేసేటప్పుడు అపరాజిత పుష్పాలు లేదా శంఖు పుష్పాలను సమర్పిస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు చేకూరుతుందట. ముఖ్యంగా ఈ పువ్వులను సమర్పించడం వల్ల విష్ణువు సంతోషిస్తాడట. కుటుంబం మొత్తానికి సంతోషాన్ని ప్రసాదిస్తాడని చెబుతున్నారు.
అలాగే డబ్బు కొరత ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అపరాజిత పుష్పాలను శివలింగానికి సమర్పిస్తే ఆర్థిక స్థితి బలపడి ధనం చేకూరుతుందట. కోరిన కోరికలు నెరవేరాలన్నా అపరాజిత పుష్పాలతో పూజించడం మంచిది. పూలతో పూజించడం వల్ల నిలిచిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయట. అపరాజిత పుష్పాలను దుర్గా దేవికి, శని దేవుడు, విష్ణువు వూజలలో ఉపయోగించాలి. లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వులను సమర్పించవచ్చని చెబుతున్నారు.