మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు. కొంతమంది మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడి చెడ్డ కలలు వచ్చినప్పుడు తెగ భయపడుతూ ఉంటారు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలో భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కలలు అనేక రకాల పరిస్థితులను కూడా సూచిస్తాయట. ఇకపోతే అప్పుడప్పుడు మనకు కలలో పాములు పక్షులు జంతువులు జలచరాలు సరిసృపాలు వంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఎప్పుడైనా మీకు కలలో పాము కనిపించిందా? మరీ ముఖ్యంగా శ్రావణమాసంలో పాము కనిపించిందా? మరి అలా కనిపిస్తే దాని అర్థం ఏంటో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శ్రావణ మాసంలో కలలో పామును పట్టుకోవడం చూసినట్టైతే అది శుభప్రదంగా పరిగణించాలట. అయితే ఈ కలకు అర్థం మీరు త్వరలోనే డబ్బును సంపాదించబోతున్నారని, మీకు కూడా ఇలాంటి కల వస్తే మీరు భయపడాల్సిన పని లేదు అంటున్నారు పండితులు. కలలో మీరు పామును పట్టుకున్నట్టు కల వస్తే మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్ని తొలగిపోతాయని అర్థం అంటున్నారు. అలాగే శ్రావణ మాసంలో మీ కలలో పాము తన తలను పైకి ఎత్తడం మీరు చూసినట్టైతే దాన్ని కూడా శుభసూచకంగా భావించాలట.
అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కలలో పాము తలను పైకి ఎత్తడం చూసినట్టైతే శివుని అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం అంటున్నారు పండితులు. శ్రావణ మాసంలో మీకు కలలో తెలుపు రంగు పాము కనిపిస్తే దానిని పవిత్రంగా భావించాలని చెబుతున్నారు. ఇలా కలలో తెలుపు రంగు పాము కనిపిస్తే గౌరవం పేరు ప్రతిష్టలు పొందబోతున్నారని అర్థం అని, అన్ని శుభాలే కలుగుతాయని అర్థమట. ఒకవేళ మీకు కలలో పసుపు రంగు పాము కనిపిస్తే అది కూడా శుభ సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఈ పసుపు రంగు పాము కలలో కనిపిస్తే మీరు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారని అర్థం. శ్రావన మాసం సమయంలో మీరు మీ కలలో ఆకుపచ్చని పామును చూసినా అది శుభమే.