Site icon HashtagU Telugu

‎Spiritual: గుడికి వెళ్లినవారు నేరుగా ఇంటికి రావాలా.. అలా రాకపోతే ఏమవుతుందో మీకు తెలుసా?

Temple

Temple

Spiritual: మామూలుగా పెద్దల కాలం నుంచి కొన్ని విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని సంప్రదాయాలను పాటిస్తున్నారు కానీ వాటి వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. అలాగే కొన్ని విషయాలను ఎందుకు పాటిస్తున్నారో కూడా కొందరికి తెలియదు. అటువంటి వాటిలో దేవాలయానికి వెళ్లిన తిరిగి నేరుగా ఇంటికి రావాలి అన్న నియమం కూడా ఒకటి. చాలా మంది గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలని చెబుతుంటారు. నేరుగా ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళితే వచ్చిన పుణ్యం అంతా వారి వెంట వెళుతుంది అని చాలా మంది అంటుంటారు.

‎ అయితే అలా చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జోతిష్య శాస్త్ర ప్రకారం మీరు కేవలం గుడికి మాత్రమే వెళితే తిరిగి నేరుగా ఇంటికి రావాలని చెబుతున్నారు. అలా కాకుండా మీరు ఏదైనా పనిమీద బయటికి వెళుతూ దారిలో గుడికి వెళ్లి, ఆ పనిని చూసుకొని ఇంటికి తిరిగి రావచ్చట. దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు. అక్కడ పొందిన ఆధ్యాత్మిక అనుభూతిని, పవిత్రతను ఇంటికి తీసుకురావడానికి నేరుగా ఇంటికి వెళ్లడం మంచిది. అలాగే చాలామంది దేవాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత కాలు కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదట.

‎ఆ విధంగా చేస్తే దైవదర్శనం ద్వారా కలిగిన ఫలం, పుణ్య ఫలితం పోతుందని నమ్మకం. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఐదు నిముషాలు అయినా ఆగి ఆ తర్వాత కాళ్ళు కడుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా ఒకవేళ గుడి నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయాలి అనుకుంటే కనీసం 48 నిమిషాలు అయినా ఆగాలని చెబుతున్నారు. అయితే ఈ 48 నిముషాలు అనేది ఒక ముహూర్త కాలం అని చెబుతున్నారు పండితులు. కాబట్టి మీరు కూడా అలా గుడికి వెళితే తప్పనిసరిగా ఇంటికి రావాలని చెబుతున్నారు పండితులు.

Exit mobile version