Site icon HashtagU Telugu

Ash Gourd: ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?.

Ash Gourd

Ash Gourd

బూడిద గుమ్మడికాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బూడిద గుమ్మడికాయ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది దిష్టి. వ్యాపార ప్రదేశాలలో అలాగే ఇంటిముందు బూడిద గుమ్మడికాయను దిష్టిగా పెడుతూ ఉంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయ వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. అయితే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టేటప్పుడు చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు దానిని శుభ్రం చేయడం. ఎట్టి పరిస్థితులలో బూడిద గుమ్మడికాయను నీటితో శుభ్రం చేయకూడదట. ఇలా చేస్తే దానికున్న పవర్ పోతుందని చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయకు రకరకాల బొట్లు పెట్టి కన్ను బొమ్మ వేసి ఇంటి ముందు కట్టడం వల్ల నరదృష్టి తొలగిపోతుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం చేసి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ప్రధాన ముఖ ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను కట్టడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు అని చెబుతున్నారు. కేవలం ఇంటి వద్ద మాత్రమే కాకుండా వ్యాపార ప్రదేశంలో కూడా ఈ బూడిద గుమ్మడికాయ అయినా కట్టడం వల్ల ఎలాంటి నరదృష్టి దృష్టిలోపం వంటి సమస్యలు ఉండవట. బూడిద గుమ్మడికాయ కు నెగిటివ్ ఎనర్జీలు దూరం చేసే శక్తి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు పూజలు చేసి పండితులను అడిగి ఆ తరువాత మాత్రమే కట్టాలని చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయ కట్టిన తర్వాత ఎంత త్వరగా కుళ్ళిపోతే అంత నరదృష్టి ఎక్కువగా ఉందని నమ్మకం.