Mirror Break: పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదా.. అరిష్టమా?

సాధారణంగా చాలామంది అద్దం విషయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. మరి అద్దం విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 10:10 PM IST

సాధారణంగా చాలామంది అద్దం విషయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. మరి అద్దం విషయంలో ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అఅద్దం ర్థం లేదంటే మరకలు పడిన మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు చెరువులు నీటిలో చూసుకునేవారు.

ఇలా ప్రతి బింబాలని చూసుకునేటప్పుడు ఏ మాత్రం అటూ ఇటూ అనిపించినా అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు. అద్దం అమ్మవారి స్వరూపం అని, గడియారం ఈశ్వర స్వరూపం అని విశ్వసిస్తారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం అట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని అర్థం.

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే, ఇంట్లోకి ప్రవేశించే ఆరోగ్యకరమైన శక్తి పరావర్తనం చెంది తిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. దైవ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. ఇంట్లో అద్దం పగిలిప్పుడు ఆ అరిష్టం పోవాలంటే ముత్తైదువులకు అద్దం దానం చేయాలి. అయిటే భారతదేశంలో హిందువులు అద్దం పగిలితే కొన్ని విశ్వశించినట్టే విదేశీయులు సైతం కొన్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా రోమన్లు, గ్రీకులు, చైనీయులు, ఆఫ్రికన్లకి అద్దం చాలా సెంటిమెంట్. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలసుకోవాలంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే చెబుతారు.

అద్దం విషయంలో అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఒక బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అందువల్లే ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు. పొరపాటున చిన్న గాజు పెంకు గుచ్చుకున్నా కొన్నిసార్లు ప్రాణాపాయం జరగొచ్చు. ఆరోగ్య పరంగా చెప్పేకన్నా అరిష్టం అంటూ సెంటిమెంట్స్ కి ముడిపెడితే తొందరగా అర్థమవుతుందని పెద్దలు ఆ విధంగా చెప్పారు.