Site icon HashtagU Telugu

Diya Wick Fully Burnt: దీపంలో వత్తి కాలిపోతే దానర్ధం ఏంటి.. అగ్గిపులతో దీపం వెలిగించకూడదా?

Diya Wick Fully Burnt

Diya Wick Fully Burnt

హిందూ ధర్మంలో దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది. ఏ ఇంట అయితే తరచుగా దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఎలాంటి సమస్యలు కూడా ఉండవని నమ్ముతూ ఉంటారు. పండుగలు విశేష రోజుల్లో మాత్రమే కాకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే “దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః.. దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః” అంటుంటారు. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది.

అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయ పడి కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది. అందుకే ఇంట్లో పెద్దలు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టాలని చెబుతూ ఉంటారు. అయితే మనం దీపం వెలిగించినప్పుడు కుందుల్లో ఉన్న వత్తి పూర్తిగా కాలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అందులో ఉన్న నూనె మొత్తం అయిపోయి వత్తి అలాగే మిగులుతూ ఉంటుంది. కొంతమంది పూర్తిగా వత్తి కాలిపోతే అశుభంగా భావిస్తారు.. ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే నిజానికి దీపంలో వ‌త్తి పూర్తిగా కాలుతోంది అంటే దానికి మూడు కార‌ణాలు ఉంటాయట. ఒక‌టి మ‌నం వాడే నూనె, రెండోది వ‌త్తి క్వాలిటీ, మూడోది మ‌నం వ‌త్తిని ఏ వైపు నిల‌బెడుతున్నాం అని,ఈ మూడు కార‌ణాల వ‌ల్ల దీపం ఎవ‌రు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని చెబుతున్నారు.

ఇక దీపం మ‌ధ్య‌లోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్ర‌మాదం కానీ,అశుభం కాదని, ఎలాంటి చెడు జ‌ర‌గ‌ద‌నే విషయం గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీపాన్ని అగ్గిపుల్లతో నేరుగా వెలిగించవచ్చా అంటే.. సాధారణంగా దీపాలను ఏకహారతితో వెలిగిస్తారు. అయితే.. కొన్ని సందర్భాల్లో అగ్గిపుల్లతో వెలిగిస్తుంటారు. ఇలా అగ్గిపుల్లతో వెలిగిస్తే అపచారం అని, పూజా ఫలితం లభించదని చాలా మంది అనుకుంటుంటారు. భక్తితో పూజ చేస్తే అగ్గిపుల్లతో వెలిగించినా, ఏకహారతితో వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అది కేవలం గౌరవానికి ప్రతీక అని చెబుతున్నారు.