హిందువులు పూజ గదిని ఎంతో పవిత్రంగా భావించడంతోపాటు ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వారు పూజ గదిని నిర్మించుకుంటూ ఉంటారు. చాలామంది తెలిసి తెలియక ఈ పూజగది విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా పూజ గదిలో ఎరుపు రంగు వాడకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి పూజ గదిలో ఎరుపు రంగు వాడితే ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎరుపు రంగు వాడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చెబుతున్నారు. సాధారణంగా ఎరుపు రంగు అనేది అగ్నికి ప్రతీకంగా చెబుతారు. ఎరుపు రంగు వలన ప్రశాంతత అనేది ఉండదట. చాలా మంది పూజ గదిలో ఎరుపు రంగును వాడుతూ ఉంటారు. ఇలా ఎరుపు రంగు వాడటం వల్ల వారి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుందని చెబుతున్నారు. ఎరుపు రంగు అనేది మంగళ గ్రహానికి సంబంధించినదట. ఈ గ్రహం సంఘర్షణకు చిహ్నంగా చెబుతారు. పూజ చేసేటప్పుడు ప్రశాంతత చాలా అవసరం. కానీ ఎరుపు రంగు వలన మనసు ప్రభావితం చెందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే శివ పూజలో ఎరుపు రంగు అనేది నిషిద్ధం.
ఎరుపు రంగు అనేది పూజలో ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందట. కళ్లు, మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందట. రెడ్ కలర్ అనేది చాలా బ్రైట్ కలర్. ఇది మానసికంగా కూడా ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో ఎరుపు రంగు అనేది అస్సలు వాడకపోవడం చాలా మంచిది. తెలుపు, పచ్చ, నీలం, పసుపు వంటి లైట్ కలర్స్ వాడటం వలన మనసుకు కూడా హాయిని ఇస్తాయి. పాజిటివ్ ఎనర్జీని నింపుతుందట. కాబట్టి వాస్తు ప్రకారం ఇకమీదట అయినా ఎరుపు రంగును పూజ గదిలో ఉపయోగించడం మానుకోండి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే దగ్గరలో ఉన్నా పండితుల సలహా తీసుకోవడం మంచిది.