Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?

బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు

Published By: HashtagU Telugu Desk
Lizard Astrology

Lizard Astrology

Lizard Astrology for Female: బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు. ఇంతకీ బల్లి స్త్రీల ఏ ఏ శరీర భాగాలలో బల్లిపడితే ఎలాంటి ప్రభావం చూపుతుంది ? ఈ విషయంపై బల్లి శాస్త్రం ఎం చెబుతోంది ?

బల్లి స్త్రీల శరీరంపై ఏ ఏ బాగాలపై పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. బల్లి స్త్రీ యొక్క శిరస్సు అంటే తలపై భాగాన పడితే మరణ భయం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అలాగే శిరోజాలపై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచన. కాలిపిక్కలను బల్లి తాకితే ఇంటికి చుట్టాలు వస్తున్నారని సూచన. అలాగే బల్లి ఎడమకన్ను ను తాకితే భర్త దగ్గరనుంచి కాని , సన్నిహితుల తో గాని విపరీతమిన ప్రేమాప్యతలు పొందుతారు. కుడికన్నును తాకితే మానసిక ఆందోళనకు గురవుతారు. కింది పెదవిపై బల్లి పడితే నూతన వస్తు లాభం .. ఇక .. పొరపాటున రెండు పెదవులపై బల్లి తాకితే కష్టాలను ఎదుర్కోక తప్పదని శాస్త్రం సెలవిస్తోంది. ఇక.. స్త్రీల యొక్క వీపు భాగంలో బల్లి పడినట్లయితే మరణ వార్త వింటారు. ఇక.. అర్ధం పర్ధం లేని గొడవలకు దారితీసే పరిస్థితి ఎప్పుడు ఎదురవుతున్దంటే .. బల్లి స్త్రీల చేతి గోళ్ళపై పడ్డప్పుడు. గోళ్ళపై కాకుండా కేవలం వేళ్ళను మాత్రమె తాకితే నగల ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కుడి భుజాన్ని బల్లి తాకినట్లయితే స్త్రీలలో విపరీతమయిన కామ కోరికలు కలుగుతాయి. ఇక..వక్ష స్తలంపై పడితే అంతా మంచే జరుగుతందని సూచన. స్త్రీల యొక్క కాలి వేళ్ళపై పడితే పుత్ర సంతానం సిద్ధిస్తుందని బల్లి శాస్త్రం చెబుతోంది.

We’re now on WhatsAppClick to Join

గమనిక: బల్లి శాస్త్రం ప్రకారం బల్లి స్త్రీలపై పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు నమ్మిన వారు కొందరుంటే .. నమ్మని వారు కొంతమంధి ఉంటారు.ఏది ఏమయినా శాస్త్రాలను గౌరవించడం మానవులుగా మన ధర్మం.

Also Read: Stock Market 75000 : స్టాక్ మార్కెట్ రయ్ రయ్.. తొలిసారిగా 75000 దాటిన సెన్సెక్స్

  Last Updated: 09 Apr 2024, 02:29 PM IST